భారత ఎన్నికల ప్రధాన అధికారిగా రాజీవ్ కుమార్

భారత ఎన్నికల ప్రధాన అధికారి (చీఫ్ ఎలక్షన్ కమిషనర్-సీఈసీ)గా రాజీవ్ కుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ మంత్రిత్వశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రస్తుత సీఈసీ సుశిల్ చంద్ర పదవీకాలం మే 14 తో ముగియనుంది. దీంతో ఆయన స్థానంలో రాజీవ్ కుమార్ మే 15వ తేదీన బాధ్యతలు స్వీకరించనున్నారు. 2020 సెప్టెంబరులో రాజీవ్ కుమార్ కేంద్ర ఎన్నికల కమిషనర్‌గా చేశారు. 1984 బ్యాచ్ జార్ఖండ్ క్వాడర్‌కు చెందిన రాజీవ్ కుమార్ గతంలో ఆర్థికశాఖ కార్యదర్శిగా కూడా పని చేశారు. అంతకుముందు పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ సెలక్షన్ బోర్డు చైర్మన్‌గానూ వ్యవహరించారు. ఈ సందర్భంగా కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు రాజీవ్‌కు అభినందనలు తెలియజేశారు.
Tags :