అమెరికా పర్యటనలో రాజ్నాథ్, జైశంకర్

భారత్, అమెరికా మధ్య 2 ప్లస్ 2 స్థాయి సంప్రదింపుల ప్రక్రియలో భాగంగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అమెరికాకు చేరుకున్నారు. ఈ భేటీ సందర్భంగా ఇరు దేశాల రక్షణ, విదేశాంగ మంత్రుల స్థాయిలో కీలక చర్చలు జరుగుతాయి. ప్రధాన శాఖల మంత్రుల స్థాయి సమావేశం వరుసలో ఇది నాలుగో భేటీ. ఈ నెల 10 నుంచి 15 వరకూ రక్షణ మంత్రి అమెరికాలో ఉంటారు. ఈ చర్చల పాల్గొనేందుకు భారత విదేశాంగ మంత్రి జైశంకర్ కూడా ఇక్కడికి చేరుకున్నారు. ఉక్రెయిన్పై రష్యా దాడుల నేపథ్యంలో భారత్, అమెరికా 2 ప్లస్ 2 భేటీ అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించింది.
Tags :