MKOne TeluguTimes-Youtube-Channel

ఆస్కార్ గెలిచిన చిత్రాలకు రాజ్యసభ కంగ్రాట్స్

ఆస్కార్ గెలిచిన చిత్రాలకు రాజ్యసభ కంగ్రాట్స్

ప్రపంచ ప్రఖ్యాత ఆస్కార్ అవార్డు అందుకున్న భారతీయ చిత్రాలకు రాజ్యసభ ఎంపీలు శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఏడాది జరిగిన ఆస్కార్స్ అవార్డుల వేదికలో ఆర్ఆర్ఆర్ సినిమాలోని ‘నాటు నాటు’ పాటకు, అలాగే ఎలిఫెంట్ విస్పరర్స్ అనే చిత్రానికి అవార్డులు దక్కిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రాజ్యసభలో ఈ చిత్రాలకు ఎంపీలంతా శుభాకాంక్షలు తెలియజేశారు. ఇలా భారతీయ సినిమాలకు ఆస్కార్ అవార్డులు రావడం మ‌న వైభ‌వాన్ని చాటుతుంద‌ని రాజ్యసభ చైర్మన్ జ‌గ‌దీప్ ధ‌న్‌క‌ర్ అన్నారు. భార‌తీయ చ‌ల‌న‌చిత్ర రంగానికి ఇది ఒక కొత్త గుర్తింపును సంపాదించి పెట్టిందని కొనియాడారు. ప్ర‌పంచ దేశాల నుంచి మ‌న సినిమాల‌కు ప్ర‌శంస‌లు దక్కుతున్నాయని మెచ్చుకున్న ఆయ‌న.. అవార్డులు గెలుచుకున్న ఆర్ఆర్ఆర్, ద ఎలిఫెంట్ విస్పర‌ర్స్ చిత్ర బృందాల‌కు స‌భ త‌ర‌పున కంగ్రాట్స్ చెప్తున్నామన్నారు.

 

 

Tags :