పొగాకు బోర్డు సభ్యుడిగా జీవీఎల్

పొగాకు బోర్డు సభ్యుడిగా జీవీఎల్

పొగాకు బోర్డు సభ్యుడిగా బీజేపీ ఎంపీ (రాజ్యసభ) జీవీఎల్‌ నరసింహారావు నియమితులయ్యారు. గత డిసెంబర్‌ 14న రాజ్యసభలో ఆమోదించిన తీర్మానం ప్రకారం జీవీఎల్‌ నియమాకాన్ని ఖరారు చేస్తూ రాజ్యసభ సెక్రటరియేట్‌ ఆదేశాలు జారీ చేసింది. పొగాకు బోర్డు చట్టం 1975లోని సెక్షన్‌ 4(4)(బి)తో పాటు పొగాకు బోర్డ్‌ రూల్స్‌, 1976లోని రూల్‌ 4(1) ప్రకారం పొగాకు బోర్డు సభ్యుల్లో ఒకరిని రాజ్యసభ నుంచి ఎంపిక చేయాల్సి ఉంటుంది. లోక్‌సభ నుంచి ఇద్దరిని ఎంపిక చేయాల్సి ఉండగా, కరీంనగర్‌ ఎంపీ (బీజేపీ) బండి సంజయ్‌, మచిలీపట్నం ఎంపీ (వైఎస్సార్సీపీ) వల్లభనేని బాలశౌరిని ఇప్పటికే నియమించారు. తాజా నియామకంపై హర్షం వ్యక్తం చేసిన ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు, తాను పొగాకు రైతుల సమస్యలను లేవనెత్తడం కొనసాగిస్తానని, వారి సంక్షేమం, మరియు పొగాకు ఎగుమతులను ప్రోత్సహించడం కోసం మరింత చురుగ్గా పనిచేస్తానని తెలిపారు. జీవీఎల్‌ నరసింహారావు గతంలో రాజ్యసభ ద్వారా సుగంధ ద్రవ్యాల బోర్డు సభ్యులుగా ఎన్నికై, పనిచేస్తున్నారు. మిర్చి జాతీయ టాస్క్‌ఫోర్స్‌ కమిటీకి ఛైర్మన్‌గా కూడా నియమితులైన విషయం తెలిసిందే. 

 

Tags :