శంకర్- రామ్ చరణ్-హృతిక్ రోషన్ కాంబీ లో మల్టీ స్టారర్ చిత్రం?

శంకర్- రామ్ చరణ్-హృతిక్ రోషన్ కాంబీ లో మల్టీ స్టారర్ చిత్రం?

శంకర్ ప్రస్తుతం రామ్ చరణ్ తో కలిసి ఓ సినిమా చేస్తున్నాడు. దీని తరువాత మళ్లీ రామ్ చరణ్, హృతిక్ రోషన్ లతో మల్టీ స్టారర్ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. రామ్ చరణ్ తో శంకర్  ప్రస్తుతం RC#15 అనే చిత్రం చేస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఇండియన్ 2, అపరిచితుడు రీమేక్ సినిమాలు కూడా శంకర్ లైన్‌లో ఉన్నాయి. అవి రెండు కూడా వివాదాల్లో చిక్కుకున్నాయి. ఇండియన్ 2 చిత్రం ఉంటుందని అయితే కమల్ హాసన్ క్లారిటీ ఇచ్చాడు. అది కూడా శంకర్ దర్శకత్వంలోనే ఉంటుందని తేల్చి చెప్పాడు. ఇక అపరిచితుడు రీమేక్ మాత్రం తెలియడం లేదు. ఇది కాకుండా ఓ సినిమా మీద ఎప్పటి నుంచో రూమర్ వినిపిస్తూనే వస్తోంది.శంకర్ ఓ అండర్ వాటర్ సైన్స్ ఫిక్షన్ సినిమాను తీయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాడని, అది కూడా బాలీవుడ్ హీరోలతో తీయాలని భావిస్తోన్నట్టు ఇప్పటికే ఎన్నో కథనాలు వచ్చాయి. వాటిలో ఇది వరకు షారుఖ్ ఖాన్‌ను పెట్టాలని శంకర్ భావించినట్టు సమాచారం వచ్చింది.అయితే  ఇప్పుడు లేటెస్ట్‌గా మరో బజ్ బయటకు వచ్చింది.

రామ్ చరణ్, హృతిక్ రోషన్‌లతో అండర్ వాటర్ సైన్స్ ఫిక్షన్ చిత్రాన్ని భారీ ఎత్తున తీయాలని శంకర్ భావిస్తున్నాడట. దాదాపు వెయ్యి కోట్ల బడ్జెట్‌తో ఈ ప్రాజెక్ట్ తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నాడట. మొత్తానికి ఈ రూమర్లు మాత్రం నిన్నటి నుంచి నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతోంది. వీటిపై ఎలాంటి అధికారిక ప్రకటన అయితే రాలేదు. ఇక ఇప్పుడు శంకర్ RC #15 సినిమాతోనే బిజీగా ఉన్నాడు. ఇది వరకే మూడు షెడ్యూల్స్ అయ్యాయి. పూణె, రాజమండ్రి, అమృత్ సర్, వైజాాగ్ వంటి ప్రాంతాల్లో షూటింగ్ చేశారు. 

 

Tags :