చరణ్ కి NDTV ప్రతిష్టాత్మక పురస్కారం ....

చరణ్ కి NDTV ప్రతిష్టాత్మక పురస్కారం ....

RRR తర్వాత మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. ప్రపంచవ్యాప్తంగా అందరి మన్ననలు అందుకుంటున్నాడు ఈ యంగ్ హీరో. విదేశీ వేడుకలకు అటెండ్ అవుతుండడంతో ప్రెజెంట్ మీడియా దృష్టి అంతా చెర్రీ పైనే ఉంది.

ఇక జాతీయ మీడియాలో చెర్రీ హవా మాములుగా లేదని చెప్పాలి. కరణ్ జోహార్ షో " కాఫీ విత్ కరణ్ ", కపిల్ శర్మ బుల్లితెర షోస్ తో చెర్రీ అక్కడి ప్రేక్షకులకి మరింత చేరువయ్యాడు. తాజాగా జాతీయ మీడియా నుండి అరుదైన పురస్కారాన్ని చెర్రీ అందుకున్నాడు.

ప్రముఖ జాతీయ మీడియా NDTV ప్రతిష్టాత్మక పురస్కారం రామ్ చరణ్ కి దక్కింది. "ఫ్యూచర్ ఆఫ్ యంగ్ ఇండియా" అవార్డు ఆయనకి లభించింది. ఈ అవార్డుని తీసుకోవడానికి చెర్రీ ఇప్పటికే ఢిల్లీ వెళ్ళారు. ఈ అవార్డు లభించడం చాలా సంతోషంగా ఉందని మెగా అభిమానులు పండగ చేసుకుంటున్నారు.

సోషల్ మీడియాలో ఫాన్స్ సహా, అన్ని వర్గాల వారి నుండి చెర్రీ కి విషెస్ పోటెత్తుతున్నాయి. తాజా గుర్తింపుతో చెర్రీ రేంజ్ మరింత  పెరిగే అవకాశం కనిపిస్తుంది. తనయుడి విజయానికి మెగాస్టార్ ఎలా స్పందించారు అని ఆరా తీయగా, ఆయన ఆనందానికి అవధులు లేవని తెలిసింది.

"చరణ్ విజయానికి నేనెంతో సంతోషిస్తున్నాను, ఈ విషయం విన్న తర్వాత త్రిల్ ఫీల్ అయ్యాను, చాలా గర్వంగా ఉందని" మెగాస్టార్ చిరంజీవి సామాజిక మాధ్యమాల్లో రాశారు. చరణ్ తన కెరీర్ లో ఇంకా ముందుకి వెళ్లాలని ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా త్రోబ్యాక్ ఫామిలీ చిత్రాన్ని కూడా మెగాస్టార్ పోస్ట్ చేసారు. ఇందులో చరణ్ చాలా క్యూట్ గా కన్పిస్తున్నారు.

చెర్రీ తదుపరి చిత్రాలన్నీ పాన్ ఇండియా సినిమా  లైనప్ తో ఉన్నవే కావడం విశేషం. ప్రెజెంట్ ఫేమస్ డైరెక్టర్ ఎన్. శంకర్ తీస్తున్న RC 15 సినిమాలో చరణ్ బిజీ గా ఉన్నారు. ఇటీవలే ఈ చిత్రం విదేశీ షెడ్యూల్ ని పూర్తి చేసి ఇండియాకి వచ్చిన చరణ్ NDTV పురస్కారాన్నిఢిల్లీ లో  అందుకున్నారు. 

 

 

Tags :