మగధీర ప్లేస్‌లో ఆరెంజ్‌నా?

ప్రస్తుతం రీరిలీజ్‌ల ప్రవాహం తెగ పెరుగుతుంది. ఎవరికి వారు తగ్గేదేలే అంటూ ఎక్కడో ఉన్న పాత సినిమాలను బయటకి తీస్తున్నారు. బ్లాక్ బస్టర్ సినిమాలే కాదు, ఒరిజినల్ గా రిలీజైన టైమ్‌లో డిజాస్టర్స్ గా పేరు తెచ్చుకున్న వాటిని విచిత్రంగా అదే పనిగా మళ్లీ ఫ్యాన్స్ కోసమని రిలీజ్ చేస్తున్నారు.
ఈ నెల 27న రామ్ చరణ్ బర్త్ డే ను పురస్కరించుకుని మగధీరను రీ రిలీజ్ చేయనున్నట్లు పదిహేను రోజుల కిందట గీతా ఆర్ట్స్ సంస్థ అధికారికంగా ప్రకటించింది. కానీ అనుకోకుండా ప్లాన్ లో చిన్న ఛేంజ్ వచ్చింది. మగధీర ప్లేస్ లో ఆరెంజ్ ని రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తుంది.
వాస్తవానికి చరణ్ బర్త్‌డే కు మగధీర అయితే పర్ఫెక్ట్ గా సెట్ అయేది. చరణ్, రాజమౌళి కాంబినేషన్లో వచ్చిన మగధీర అయితే బాగుండేది. ఎలాగూ రీసెంట్ గా వీరిద్దరి కాంబోలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ కు ఆస్కార్ రావడంతో వారి కలయికలో వచ్చిన మగధీర అయితేనే అన్ని విధాల సరిగా సరిపోతుంది.
అంతా బాగానే ఉంది ఆరెంజ్ సినిమాను సోషల్ మీడియాలో పొగడటం తప్పించి అదొక డిజాస్టర్ మూవీ. అప్పట్లో ఈ సినిమా వల్ల నిర్మాత నాగబాబు సూసైడ్ చేసుకుందామనుకునే వరకు వెళ్లాడు. హరీష్ జయరాజ్ సంగీతం తప్పించి సినిమాలో మెప్పించేదేమీ లేదు. మరి అలాంటి ఫ్లాప్ సినిమాను రీ రిలీజ్ చేయడం వల్ల అసలు ప్రయోజనముంటుందా అనే అనుమానాలు కూడా ఉన్నాయి. మరోవైపు మగధీర ప్రింట్ కు సంబంధించిన టెక్నికల్ ఇష్యూస్ వల్ల దానికి బదులు ఈ సినిమాను రీ రిలీజ్ చేస్తున్నారనే టాక్ కూడా నడుస్తుంది.