రాష్ట్ర గిరిజన ఆర్థిక సహకార సంస్థ చైర్మన్‌గా రామచందర్ నాయక్

రాష్ట్ర గిరిజన ఆర్థిక సహకార సంస్థ  చైర్మన్‌గా రామచందర్ నాయక్

తెలంగాణ రాష్ట్ర గిరిజిన ఆర్థిక సహకార సంస్థ చైర్మన్‌గా ఇస్లావత్‌ రామచందర్‌ నాయక్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్‌ నియమించారు.  ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ రామచందర్‌ నాయక్‌కు నియామక పత్రాన్ని అందజేసి, అభినందించారు. ఈ పదవిలో రామచందర్‌ నాయక్‌ రెండేండ్లు పాటు కొనసాగనున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు రవీంద్రకుమార్‌, నోముల భగవత్‌, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌ రెడ్డి, ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్‌ రావు పాల్గొన్నారు. నల్గొండ జిల్లా త్రిపురారం మండలానికి చెందిన రామచందర్‌ నాయక్‌ ఎంపీపీగా, జడ్పీ ఫ్లోర్‌ లీడర్‌గా పని చేశారు. ప్రస్తుతం ఆయన నల్గొండ రైతు బంధు సమితి అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.

 

Tags :