ఆచార్య బిగ్ అప్‌డేట్.. ధర్మమే ‘సిద్ధ’ అంటూ మెగా ఫాదర్ అండ్ సన్

ఆచార్య బిగ్ అప్‌డేట్.. ధర్మమే ‘సిద్ధ’ అంటూ మెగా ఫాదర్ అండ్ సన్

ఆచార్యలో రామ్ చరణ్ రోల్‌పై మేకర్స్ బిగ్ అప్‌డేట్ ఇచ్చారు. సిద్ధ పాత్రలో నటిస్తున్న రామ్ చరణ్ టీజర్‌ వచ్చే నవంబర్ 28న రిలీజ్ చేస్తున్నట్టుగా అధికారిక ప్రకటన ఇస్తూ కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. మెగా తండ్రీకొడుకులు ఒకే సినిమాలో ఫుల్ లెంగ్త్ రోల్‌‌లో నటిస్తున్న సినిమా 'ఆచార్య'. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ ప్రతిష్టాత్మక సినిమాలో చిరంజీవి హీరోగా నటిస్తుండగా రామ్ చరణ్ సిద్ద పాత్ర పోషిస్తున్నారు. నక్సలైట్‌ సిద్ధగా చెర్రీ రోల్ సినిమాకు మేజర్ అట్రాక్షన్ కానుందట. ఇప్పటికే 90 శాతానికి పైగా ఈ సినిమా షూటింగ్ ఫినిష్ చేశారు. చిత్రాన్ని ఫిబ్రవరి 4న విడుదల చేస్తున్నట్లు ప్రకటించిన చిత్రయూనిట్ ప్రమోషన్స్ వేగవంతం చేసింది.

ఈ నేపథ్యంలో రామ్ చరణ్ రోల్‌పై మేకర్స్ బిగ్ అప్‌డేట్ ఇచ్చారు. సిద్ధ పాత్రలో నటిస్తున్న రామ్ చరణ్ టీజర్‌ వచ్చే నవంబర్ 28న రిలీజ్ చేస్తున్నట్టుగా అధికారిక ప్రకటన ఇస్తూ కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌ను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసిన చిరంజీవి.. 'ధర్మమే సిద్ధ' అంటూ ట్యాగ్ చేశారు. రామ్ చరణ్ ట్వీట్ చేస్తూ 'గుర్తుండిపోయే పాత్ర సిద్ధ. పవర్‌ఫుల్‌ టీజర్‌ రానుంది' అని పేర్కొన్నారు. దేవాలయ భూముల స్కామ్ నేపథ్యంలో ఈ సినిమా రూపొందిస్తున్నారు. భారీ బడ్జెట్‌ కేటాయించి నిర్మిస్తున్న ఈ సినిమా నిర్మాణంలో రామ్ చరణ్ కూడా భాగమవుతుండటం విశేషం. చిరంజీవి సరసన కాజల్ నటిస్తుండగా, రామ్ చరణ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. మణిశర్మ బాణీలు కడుతున్నారు. నక్సల్స్ బ్యాక్ డ్రాప్‌తో ఎక్కడా తగ్గకుండా కమర్షియల్ ఎలిమెంట్స్ జోడిస్తూ ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్‌కు భారీ రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీపై మెగా లోకంలో ఓ రేంజ్ అంచనాలు ఉన్నాయి.

 

Tags :