ఉప్పల్ లో రాంకీ జెన్ నెక్ట్స్ ప్రాజెక్ట్

ఉప్పల్ లో రాంకీ జెన్ నెక్ట్స్ ప్రాజెక్ట్

హైదరాబాద్‌ వెస్ట్‌ సైడ్‌ జూబిలీ హిల్స్‌ నుంచి కొండాపూర్‌ (సైబర్‌ టవర్స్‌), అక్కడ నుంచి గచ్చిబౌలి, అక్కడ నుంచి ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌, అక్కడ నుంచి ఇంకా బయటకు సైబరాబాద్‌గా మారటం అందరికీ తెలిసిందే. అలాగే పెరిగిపోయిన ఇండస్ట్రీ, అందులో పనిచేసే ఐటి ప్రొఫెషనల్స్‌ హైదరాబాద్‌ ల్కెఫ్‌ స్టైల్‌ని ఎలా మార్చారో కూడా తెలుసు. చివరగా పెరిగిపోయిన ఐటి జనాభాకి తగ్గట్టుగా ఎంత పెంచినా సరిపోని రవాణ సదుపాయాలతో ప్రతి రోజు ఉదయం, సాయంత్రం ఏర్పడుతున్న ట్రాఫిక్‌ సమస్యలు హైదరాబాద్‌ వాసులకు కొత్తేమి కాదు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్‌ నగర తూర్పు దిశగా ఇంకో ఐటి కారిడార్‌ ఏర్పాటు చేయడం ద్వారా ఈ రవాణ వ్యవస్థను చక్కదిద్దుకోవచ్చన్న ఆలోచనతో ఆ దిశగా అనేక నిర్ణయాలు తీసుకొంటోంది.

తెలంగాణ ప్రభుత్వ ఐటీ శాఖా మంత్రి కే టి రామారావు మాట్లాడుతూ ‘హైదరాబాద్‌ వెస్ట్‌ సైడ్‌ ఏ విధంగా అభివృద్ధి చెందుతోందో మనందరం చూస్తున్నాం. అలాంటి అభివృద్ధి నగారానికి అన్ని వైపులా ఉంటేనే నగరం మరిన్ని అవకాశాలు అందుకోగలుగుతుంది, ఐటీ రంగం ఇంకా అభివృద్ధి చెందుతూ ఉండగా, ప్రభుత్వం నుంచి పూర్తిస్థాయి సహాయ సహకారాలు ఇవ్వాలనే ఉద్దేశ్యంతో తూర్పు హైదరాబాద్‌ వైపున ఇంకొక ఐటీ కారిడార్‌ నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్నాం. అందులో భాగంగానే కొంపల్లి, ఉప్పల్‌, నాగోల్‌, ఎల్‌బి నగర్‌లలో ఐటీ పార్క్‌లు ఏర్పాటు చేస్తున్నాం’’ అని అన్నారు.

హైదరాబాద్‌ తూర్పువైపు ఐటీరంగం విస్తరణను దృష్టిలో ఉంచుకుని రాంకీ గ్రూపు ఉప్పల్‌ ఏరియాలో   ‘జెనెక్స్ట్‌ స్క్వేర్‌ టవర్స్‌’’కు శ్రీకారం చుట్టింది. ప్రైడ్‌ ఆఫ్‌ ది ఈస్ట్‌, ఉప్పల్‌ ఇప్పుడు తూర్పు హైదరాబాద్‌లో అత్యంత అభివృద్ధి చెందుతున్న ప్రాంతంగా పేరు పొందింది.  ఇలాంటి ప్రాంతంలో రాంకీ గ్రూపు ఈ ప్రాజెక్టును నిర్మిస్తోంది.  తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన LEAP(Look East Policy) ప్రకారం  ఈస్ట్‌ హైదరాబాద్‌లో రాబోతున్న IT/IT  సంస్థల మౌలిక సదుపాయాలు ఏర్పాటు లో భాగంగా రాంకీ సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకంగా  జెనెక్ట్‌ స్క్వేర్‌ టవర్స్‌ నిర్మాణం మొదలు పెట్టింది. 

ఉప్పల్‌లో రాబోతున్న ‘జెన్‌ నెక్స్ట్‌ స్క్వేర్‌ టవర్స్‌’’

ఇప్పుడు హైదరాబాద్‌ నగరం లో ఉప్పల్‌ ప్రాతం రవాణా సౌకర్యాలతో చాల ప్రాముఖ్యత (Ease of Connectivity) సంపాదించుకొంటోంది. రాంకీ  జెన్‌ నెక్స్ట్‌ టవర్స్‌ కూడా ఉప్పల్‌ నది బొడ్డున ఉండటం వలన పూర్తి స్థాయి రోడ్‌ కనెక్టివిటీ, మెట్రో రైల్‌ స్టేషన్‌కి దగ్గరలో ఉండటం, ఉప్పల్‌ ఏరియా కూడా ఈ మధ్య కాలంలో అభివృద్ధి చెందిన కాస్మోపాలిటన్‌ వాతావరణంలతో ప్రశాంతంగా వుండటం ఒక మంచి పరిణామం. రామ్‌కీ వన్‌ చేపట్టిన జెన్‌ నెక్స్ట్‌ టవర్స్‌ మీరు కోరుకున్నవాటిని అందించే ప్రాజెక్ట్‌. విభిన్న తరాల అవసరాలను పరిగణనలోకి తీసుకుని, మీరు గర్వించేలా సకల సౌకర్యాలతో అంతర్జాతీయ సొగసులతో అపారమైన శ్రద్ధతో ఈ ప్రాజెక్టు తయారవుతోంది. మనోహరమైన మరియు ప్రశాంతమైన వాతావరణంలో మీరు కలలుగన్న ప్రతిదీ ఇందులో మీకు లభిస్తుంది.

8.64 ఎకరాల సువిశాల స్థలంలో జెన్‌ నెక్స్ట్‌ ప్రాజెక్ట్‌ రెండు టవర్స్‌గా నిర్మితమవుతోంది. టవర్‌ A డ దీ కలిపి  దాదాపు 21 లక్షల స్క్వేర్‌ ఫుట్‌కు పైగా ఆఫీస్‌ స్పేస్‌గా ఒక బేస్‌ మెంట్‌, 4 స్టీల్ట్‌ పార్కింగ్‌ ఫ్లోర్స్‌, 11 ఆఫీస్‌  ఫ్లోర్స్‌తో అత్యంత ఆధునిక సదుపాయాలతో  గ్రేడ్‌ A నిర్మాణంగా తయారయ్యే ఈ ఫెసిలిటీ ఈస్ట్‌ సైడ్‌న రాబోయే కట్టడాలకు తలమానికంగా ఉంటుందనటంలో సందేహం లేదు. ఈ గ్రేడ్‌ A నిర్మాణం వలన  ఆఫీస్‌ స్పేస్‌లో 70ంన ట్‌కి ఒక మనిషి చొప్పున ఉంచ వచ్చు కనుక చాలా కాస్ట్‌ ఎఫెక్టివ్‌ అవుతుంది అని తెలుస్తోంది. అంటే మొత్తం టవర్స్‌లో దాదాపు 15,000 మంది ఉద్యోగులు పని చేయవచ్చు అన్న మాట. ఇందులోనే  రెస్టారెంట్‌, 2 రిటైల్‌ షాప్స్‌, ఓపెన్‌ రిక్రియేషన్‌ స్పేస్‌ కూడా ఇస్తున్నారు. ఆధునాతనిక లిఫ్ట్‌లు, కార్‌ పార్కింగ్‌ ఏర్పాట్లు, ఎలక్ట్రిక్‌ కార్‌ ఛార్జింగ్‌ వసతులు వంటి అనేక సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నారు.

ప్రముఖ MNC సంస్థతో లీజ్‌ ఏర్పాట్లు జరిగాయి - నంద కిషోర్‌, మానేజింగ్‌ డైరెక్టర్‌

‘జెన్‌ నెక్స్ట్‌ టవర్స్‌’’ పూర్తి స్థాయి ఆధునిక సదుపాయాలతో నిర్మిస్తున్నారు. పేరుకు తగ్గట్టు గానే అన్ని వసతులు వుండి అందరికీ నచ్చుతుంది. ఇప్పటికే 8 లక్షల స్క్వేర్‌ ఫీట్‌ ఏరియాని ఒక పెద్ద ఎంఎన్‌సి కంపెనీ 15 ఏళ్ల లీజ్‌కి తీసుకుందని,  ఇది మాకు,  ఇన్వెస్టర్‌లకు ఒక శుభ ప్రారంభం అని సంస్థ మేనెజింగ్‌ డ్కెరెక్టర్‌ నంద కిషోర్‌ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి పథకాలలో ఈస్ట్‌ హైదరాబాద్‌ అభివృద్ధి ఒకటి అని, ఇప్పటికే ప్రభుత్వం ఒక వైపు రాంకీ లాంటి ప్రముఖ బిల్డర్స్‌ - ప్రాపెర్టీ డెవలపర్స్‌ను  ఒక వైపు, మైక్రొసాఫ్ఫ్ట్‌, అమెజాన్‌ లాంటి  ఐటి దిగ్గజాలను ఇంకో వైపు సంప్రదిస్తోందని, వారందరు కూడా ఈ ప్రతిపాదనను స్వాగతిస్తున్నారని నంద  కిషోర్‌ తెలిపారు.  ఆ విధంగా జెన్‌నెక్స్ట్‌ ప్రాజెక్ట్‌ చాల లాభదాయకమైన పెట్టుబడి అవుతుందని తెలిపారు.

అమెరికాలోని తెలుగువారికి ఆఫర్‌ - తారక రాజేష్‌ దాసరి, డైరెక్టర్‌

ఈ ప్రాజెక్టుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావలసిన అన్ని అనుమతులు గత నెలలోనే వచ్చేయని, మొట్టమొదటగా ఈ ప్రాజెక్ట్‌ని అమెరికాలోని తెలుగు వారికి ఆఫర్‌ చేస్తున్నామని, ప్రస్తుతం అమెరికాలో  జెన్‌ నెక్స్ట్‌ ప్రాజెక్ట్‌లో ఇప్పటికే లీజ్‌కి ఇచ్చిన ఎరియా, లీజ్‌ ఇవ్వని ఏరియాని మార్కెటింగ్‌ చేస్తున్నామని, ఇప్పటి వరకు మాట్లాడిన వారు ఈ ప్రాజెక్ట్‌లో భాగస్వాములు కావటానికి ఉత్సాహంగా వున్నారని తారక రాజేష్‌ డైరెక్టర్‌, రాంకీ ఎస్టేట్స్‌ తెలిపారు.

వివరాలకు సంప్రదించండి.

Site Address :

CG5X QCJ Ramky One Genext Towers
Genpact Rd, Vignana Puri
Habsiguda, Hyderabad - 500 007
Ph : +1 669302 3302

 

Tags :
ii). Please add in the header part of the home page.