డొమినికన్ రిపబ్లిక్ రాయబారిగా రాము అబ్బగాని

డొమినికన్ రిపబ్లిక్ రాయబారిగా రాము అబ్బగాని

డొమినికన్‌ రిపబ్లిక్‌లో భారత రాయబారిగా 2001 బ్యాచ్‌ ఐఎఫ్‌ఎస్‌ అధికారి రాము అబ్బగాని నియమితులయ్యారు. రామును డొమినికన్‌ రిపబ్లిక్‌ రాయబారిగా నియమిస్తూ విదేశాంగ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. త్వరలో ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు.  రాము అబ్బగాని స్వస్థలం తెలంగాణ రాష్ట్రంలోని హనుమకొండ. మర్కాజీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో  పాఠశాల విద్య పూర్తి చేశారు. ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ చదివారు. ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో బీవీఎస్సీ, ఎంవీఎస్సీ చేశారు. తర్వాత కొన్నాళ్లు జైపూర్‌లో నాబార్డ్‌ మేనేజర్‌గా సేవలందించారు. రాము అబ్బగాని 2001లో ఇండియన్‌ ఫారిన్‌ సర్వీస్‌కు ఎంపికయ్యారు. జపాన్‌, థాయ్‌లాండ్‌లోని భారతీయ రాయబార కార్యాలయాల్లోనూ పని చేశారు. రాము అబ్బగాని ప్రస్తుతం కేంద్ర విదేశాంగ శాఖలో సంయుక్త కార్యదర్శి హోదాలో పనిచేస్తున్నారు.

 

Tags :