రానా రిలీజ్ చేసిన అశోక్ గల్లా, శ్రీరామ్ ఆదిత్య ‘హీరో’ ఫస్ట్ సింగిల్ ‘అచ్చ తెలుగందమే’..

రానా రిలీజ్ చేసిన అశోక్ గల్లా, శ్రీరామ్ ఆదిత్య ‘హీరో’ ఫస్ట్ సింగిల్ ‘అచ్చ తెలుగందమే’..

సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేష్ బాబు మేనళ్లుడు, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ కుమారుడు అశోక్ గల్లా హీరోగా పరిచయం అవుతున్న చిత్రం హీరో. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో రాబోతోన్న ఈ చిత్రాన్ని అమర్ రాజా మీడియా అండ్  ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌లో శ్రీమతి  గల్లా పద్మావతి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ యూనిట్ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్ వేగవంతం చేశారు.

దానిలో భాగంగా హ్యాండ్సమ్ హంక్ రానా దగ్గుబాటి సినిమాలోని ఫస్ట్ సాంగ్  అచ్చ తెలుగందమే లిరికల్ వీడియోను విడుదల చేశారు. అశోక్ గల్లా మరియు హీరో చిత్రయూనిట్ మీద రానా ప్రశంసలు కురిపించారు.

అచ్చ తెలుగందమే..అంటూ సాగే ఈ పాటకు సంగీత దర్శకుడు జిబ్రాన్ అద్భుతమైన మెలోడి ట్యూన్‌ను ఇచ్చారు. సిధ్ శ్రీరామ్ గాత్రంతో ఈ పాట మరో స్థాయికి వెళ్లింది. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం చక్కగా కుదిరింది. ఈ పాటలో అశోక్ గల్లా, నిధి అగర్వాల్ మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది. స్క్రీన్స్ పై ఈ జంట చూడముచ్చటగా ఉంది. అశోక్ గల్లా ఈ  పాటలతో తన ఎక్స్‌ప్రెషన్స్‌తో, నిధి తన అందంతో ఆకట్టుకుంది. అశోక్ గల్లా బర్త్ డే సందర్భంగా సూపర్ స్టార్  మహేష్ బాబు విడుదల చేసిన టైటిల్ టీజర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. శ్రీరామ్ ఆదిత్య విభిన్న కథలతో భిన్న చిత్రాలను తెరకెక్కించారు. ఇక ఇప్పుడు ఈ ‘హీరో’ సినిమాను సరికొత్త కథాంశంతో ఎంటర్టైనర్‌గా రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో జగపతి బాబు, నరేష్, సత్య, అర్చన సౌందర్య ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. సమీర్ రెడ్డి, రిచర్డ్ ప్రసాద్‌లు కెమెరామెన్‌లు వ్యవహరిస్తున్నారు. జిబ్రాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. చంద్ర శేఖర్ రావిపాటి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

 

Tags :