నార్త్ కరోలినాలో ఓ మెనానిక్ కు జాక్ పాట్.. లాటరీలో

నార్త్ కరోలినాలో ఓ మెనానిక్ కు జాక్ పాట్.. లాటరీలో

అమెరికాలోని నార్త్‌ కరోలినాలోని ఓ మెకానిక్‌ను అదృష్టం వరించింది. లాటరీలో దాదాపు 2 లక్షల డాలర్లను (దాదాపు రూ.1.5 కోట్లు) అతడు గెలుచుకున్నాడు.. ఇప్పుడు ఆ డబ్బులతో తన కుటుంబ కలలను తీర్చాలని అతడు ఆశపడుతున్నాడు. ఫ్రాంక్‌విల్లే ప్రాంతానికి చెందిన గ్రెగరీ వారెన్‌ సెప్టెంబరు 29న ఓ చోట గ్యాస్‌ ఫిల్లింగ్‌ చేయడానికి వెళ్లి, అక్కడ క్యాష్‌ 5 లాటరీ టికెట్టును కొనుగోలు చేశాడు. కానీ, అక్టోబరు 4 వరకు  అతడు ఆ టికెట్‌ సంగతే పట్టించుకోనే లేదు. అనూహ్యంగా అతడు కొనుగోలు చేసిన టికెట్టే లాటరీలో జాక్‌పాట్‌ గెలుచుకుంది. పన్నుల తర్వాత దాదాపు రూ. కోటి చెక్కును అందుకున్నాడు వారెన్‌.

 

Tags :