రివ్యూ : నితిన్ బర్త్‌డే 'రంగదే' గిఫ్ట్ మిస్సైయింది

రివ్యూ : నితిన్ బర్త్‌డే 'రంగదే' గిఫ్ట్ మిస్సైయింది

తెలుగుటైమ్స్.నెట్ రేటింగ్ : 2.5/5

ఏడు రంగుల ఇంద్రధనుస్సు వెల్లువెత్తే ప్రేమ కూడా రకరకాల భావోద్వేగాల కలయిక. ఇదే కథాంశంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ‘రంగ్ దే’. గతేడాది ‘భీష‍్మ’తో సూపర్‌ హిట్‌ అందుకున్న యంగ్‌ హీరో నితిన్‌.. ఈ ఏడాది ఆదిలోనే చెక్ సినిమాతో పరాజయాన్ని చవిచూశాడు. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ‘చెక్‌’ మూవీకి ప్రేక్షకులు చెక్‌ పెట్టారు. దీంతో ఈ సారి పక్కా హిట్ కొట్టాలన్న పట్టుదలతో ఉన్నాడు నితిన్‌. ఇందులో భాగంగానే ‘తొలి ప్రేమ’ ఫేమ్‌ వెంకీ అట్లూరితో కలిసి ‘రంగ్‌ దే’ మూవీ చేశాడు. గత ఏడాది నుండి  విడుదలైన పోస్టర్లు, టీజర్లు కూడా సినిమాపై భారీ హైప్‌ క్రియేట్‌ చేశాయి. దీనికి తోడు ప్రమోషన్స్‌ కూడా గ్రాండ్‌గా చేడయంతో ‘రంగ్‌దే’పై అంచనాలు మరింత పెరిగాయి. మరి ఆ అంచనాలను ‘రంగ్‌దే’ టీమ్‌ అందుకుందా? నితిన్‌ కెరీర్‌లో 29వ సినిమాగా వచ్చిన ‘రంగ్‌దే’ని ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుందో రివ్యూలో చూద్దాం.

కథ:

అర్జున్ (నితిన్), అను (కీర్తి సురేష్). చిన్నప్పటి నుంచి పక్క పక్క ఇళ్లలోనే ఉంటూ కలిసి చదువుకుంటారు.  అర్జున్‌ చిన్నప్పటి నుంచి చదువులో వెనకబడతాడు. అదే పక్కింట్లోకి వచ్చిన అను ఎప్పుడూ  టాపర్‌. దీంతో ప్రతిసారి అర్జున్‌ వాళ్ల నాన్న(నరేశ్‌) అనుతో పోలుస్తూ అతన్ని తిడుతుంటాడు. ఇలా ఫస్ట్‌ క్లాస్‌ నుంచి బీటెక్‌ వరకు అను వల్ల అర్జున్‌కు తిట్లు పడుతూనే ఉంటాయి. దీంతో అర్జున్‌కు అను అంటే విపరీతమైన కోపం, ద్వేషం ఏర్పడుతుంది. కానీ అనుకు మాత్రం అర్జున్‌ అంటే ఇష్టం. పెద్దయ్యాక ఆ ఇష్టం కాస్త ప్రేమగా మారుతంద. అర్జున్‌కు మాత్రం వయసుతో పాటు అనుపై కోపం పెరుగుతూనే వస్తుంది. ఇద్దరి మధ్య టామ్ అండ్ జెర్రీ లాంటి వార్ జరుగుతూనే ఉంటుంది. అయితే అను తల్లి (రోహిణి) పెళ్లి చేసుకోవాలని అనుని బలవంతం చేయడంతో అర్జున్‌ అభిప్రాయం తెలుసుకుంటుంది.

అర్జున్ కూడా పెళ్లి చేసుకోమని చెప్పడంతో.. తన మనసులోని ప్రేమను దాచుకుని పెళ్లికి సిద్ధపడుతుంది. అయితే ఆ పెళ్లికి దారితీసిన పరిస్థితులకు అసలు కారణం అర్జున్ అనే తెలుసుకున్న అను.. అయితే అనుకొని ఒక సంఘటన వల్ల అర్జున్‌ అనుని పెళ్లి చేసుకుని అర్జున్‌తో తాళి కట్టించుకుని భార్య అవుతుంది. అనుతో మాట్లాడడానికే ఇష్టపడని అర్జున్‌ ఆమెను పెళ్లి ఎందుకు చేసుకున్నాడు? పెళ్లి తర్వాత ఆమెతో కాపురం ఎలా చేశాడు? వారిద్దరి మధ్య గొడవలు అలానే నడిచాయా? లేదా ఒకరినొకరు అర్థం చేసుకొని సంసారం చేశారా? చివరికి వారిద్దరి ఇగోలు పక్కనపెట్టి ఎలా ఒక్కటయ్యారు అనేదే మిగతా కథ.

నటీనటుల హావభావాలు:

అల్లరిచిల్లరగా తిరిగే అర్జున్‌ పాత్రలో నితిన్‌ అద్భుతంగా నటించాడు. క్యూట్‌ అండ్‌ స్టైలీష్‌ లుక్‌తో అదరగొట్టాడు. కామెడీ స్లీన్లతో పాటు ఎమోషనల్‌ సన్నివేశాలలో అలరిస్తూ....   నచ్చని భార్యతో కాపురం చేయమంటే ఎంత చికాకుగా ఉంటుందో అర్జున్‌ పాత్ర తెలియజేస్తుంది. ఇక మహానటి కీర్తి సురేష్‌ అల్లరి పిల్ల అను పాత్రలో జీవించేసింది. అను పాత్రకు కీర్తి సురేష్‌ను పిక్ చేసుకోవడం ద్వారా చాలా వరకూ సేవ్ అయ్యారు. అమాయకంగా ఉంటూనే అర్జున్‌ని ఇరకాటంతో పడేస్తుంది. కొన్ని ఎమోషన్‌ సీన్లలో కూడా అవలీలగా నటించి నిజంగానే మరో సారి  మహానటి అనిపించుకుంది.

హీరో తండ్రి పాత్రలో నరేష్ ‌ అలరించాడు. తనదైన శైలీలో కామెడీ చేస్తూ నవ్వులు పూయించాడు. ఇక హీరో స్నేహితులుగా ‘కలర్‌ ఫోటో’ ఫేమ్‌ సుహాస్‌‌, అభినవ్‌ గౌతమ్‌ పర్వాలేదనిపించారు. సెకండాఫ్‌లో వచ్చిన వెన్నల కిషోర్‌ ఉన్నంతలో కాస్త నవ్వించే ప్రయత్నం చేశాడు. వినీత్‌, సత్యం రాజేశ్‌, బ్రహ్మాజీ తదితరులు తమ పాత్రల పరిధిమేర నటించారు. 

నటి నటుల పనితీరు:

దర్శకుడు వెంకీ అట్లూరి చెప్పాలనుకున్న పాయింట్‌ను కాస్త ఎమోషనల్‌గా చూపించాలనుకున్నాడు. కానీ అది వర్కౌట్‌ కాలేదు. కథలో కొత్తదనం ఏమిలేదు కానీ తెరపై చూపించిన విధానం బాగుంది. ప్రేక్షకుడికి బోర్‌ కొట్టించకుండా కథనాన్ని సాగించాడు. దేవి శ్రీ ప్రసాద్ సాంగ్స్‌తో బ్యాగ్రౌండ్ స్కోర్‌తో ఆకట్టుకున్నారు. పీసీ శ్రీరామ్ తన కెమెరాపనితనంతో ‘రంగ్ దే’ చిత్రాన్ని ఫుల్ కలర్ ఫుల్‌గా చూపించారు. పరిమిత లొకేషన్లలో సినిమాని చాలా రిచ్‌గా చూపించారు. ముఖ్యంగా కీర్తి సురేష్ లను నితిన్‌లను స్క్రీన్‌పై చాలా అందంగా చూపించారు. సితారా ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. 

విశ్లేషణ:

హీరో హీరోయిన్ మధ్య ఇగో, క్లాషెస్ లాంటి సన్నివేశాలు ప్రేక్షకుడి అలరిస్తాయి. అను, అర్జున్‌ మధ్య జరిగే టామ్‌ అండ్‌ జెర్రీ వార్‌ ప్రేక్షకులను అట్రాక్ట్‌ చేస్తుంది. అయితే స్లో నెరెషన్‌ మాత్రం ప్రేక్షకుడి సహనాన్ని పరీక్షించేలా ఉంటుంది. ఇంటర్వెల్‌లో ఇచ్చిన ట్విస్ట్ మాత్రం సెకండాఫ్‌పై మరింత ఆసక్తిని కలిగిస్తుంది. అయితే ఫ‌స్టాఫ్‌లో సినిమానే బాగానే న‌డిపిన‌, సెకండాఫ్ కాస్త దెబ్బ కొట్టించిన‌ట్టు అనిపిస్తుంది. హీరో, హీరోయిన్ల మధ్య ఎమోషనల్ సీన్స్ కన్విన్సింగ్‌గా అనిపించవు.

మొత్తంగా ‘రంగ్ దే’ చిత్రం.. కథ పరంగా రొటీన్ అనిపించినప్పటికీ నితిన్, కీర్తి సురేష్ నటనతో మెస్మరైజ్ చేశారు. ఫ్యామిలీ ఆడియన్స్‌కి కనెక్ట్ అయ్యే అంశాలు బాగానే ఉండటంతో ఒక్కసారైతే ఢోకా లేకుండా చూడొచ్చు. కొత్తదనం కోరుకునే వారికి మాత్రం ‘రంగ్ దే’లో పెద్దగా ఆకట్టుకోకపోవచ్చు. 

 

Tags :