డేరా బాబాతో పాటు మరో నలుగురికి కూడా ...శిక్ష ఖరారు

డేరా బాబాతో పాటు మరో నలుగురికి కూడా ...శిక్ష  ఖరారు

డేరా సచ్చా సౌదా నిర్వాహకుడు, వివాదాస్పద మతగురువు గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌ సింగ్‌కు జీవిత ఖైదు పడింది. 2002లో హత్యకు గురైన డేరా సౌదా మేనేజర్‌ రంజిత్‌ సింగ్‌ కేసులో ఈ బాబా పాత్ర ఉన్నట్లు హరియాణాలోని పంచకులలోని సీబీఐ న్యాయస్థానం ఇదివరకే పేర్కొంది. ఆయనతో పాటు మరో నలుగురికి ఈ హత్యకేసులో హస్తం ఉన్నట్లు తేల్చిన న్యాయస్థానం శిక్ష ఖరారు చేసింది. ఆ నలుగురికి కూడా జీవిత ఖైదు విధించింది.  కురుక్షేత్రలోని ఖాన్పూర్‌ కొలియన్‌ గ్రామానికి చెందిన రంజిత్‌ సింగ్‌ తన గ్రామంలో పొలం పనులు చేసుకుంటుండగా అతన్ని అగంతకులు కాల్చిచంపారు. డేరా బాబా మహిళలను లైంగికంగా ఏవిధంగా లొంగదీసుకునే వారో  తెలియజేసే ఒక లేఖ బయటకు రావడం వెనుక రంజిత్‌ సింగ్‌ ప్రమేయం ఉందనే అనుమానంతోనే ఈ హత్య జరిగినట్టు చెబుతారు. ఈ శిక్షలో భాగంగా కోర్టు దోషులకు జరిమానా విధించింది. డేరా బాబా రూ.31 లక్షలు చెల్లించాల్సి ఉంది. మిగతా నలుగురు లక్షన్నర నుంచి 75 వేల రూపాయల వరకు జరిమానా చెల్లించాలని ఆదేశించింది. ఈ మొత్తంలో కొంత భాగం రంజిత్‌ కుటుంబానికి వెళ్లనుంది.

 

Tags :