తమిళంలో మరోసారి రాశీఖన్నా

తెలుగులోనూ, తమిళంలోనూ నటించి బహుభాషా నటిగా పేరు తెచ్చుకున్న రాశీ ఖన్నా మరోసారి తమిళ చిత్రంలో నిర్మించనున్నారు. తమిళంలో అరడజను చిత్రాలకు పైగా చేసిన ఈ బ్యూటీ తాజాగా హీరో జీవా సరసన నటించనున్నారని టాక్. దర్శకుడు పా. విజయ్ తెరకెక్కించనున్న సినిమాలో జీవా హీరోగా, ప్రధాన పాత్రలో అర్జున్ నటించనున్నారు. ఈ పీరియాడికల్ డ్రామా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ చిత్రంలోనే రాశీ ఖన్నా హీరోయిన్‌గా నటించనున్నారని తెలిసింది. ‘‘జీవా, అర్జున్ ల కాంబినేషన్‌లో గతంలో నేను ఓ సినిమా ప్లాన్ చేశాను. కానీ కుదర్లేదు. ఇప్పుడు నా కొత్త సినిమాకు ఈ ఇద్దరూ ఓకే కావడం హ్యాపీగా ఉంది. మా సినిమా కోసం హైదరాబాద్‌లోని ఓ స్టూడియోలో సెట్ వేస్తున్నాం. సెట్ పూర్తి కాగానే షూటింగ్ ప్రారంభిస్తామని చెప్పారు. ఆ తర్వాత ఊటీ, కొడైకెనాల్‌లో చిత్రీకరణ ప్లాన్ చేశాం అని పేర్కొన్నారు పా. విజయ్.