రష్మిక బ్యాన్..! శీతాకాలం డైరెక్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు...

రష్మిక బ్యాన్..! శీతాకాలం డైరెక్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు...

నేషనల్ హాట్ బ్యూటీ రష్మిక మందన్నని కన్నడ ఇండస్ట్రీ నుండి బ్యాన్ చేయాలని మీడియాలో కథనాలు వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు ఇండస్ట్రీ లో ఇదొక హాట్ టాపిక్. ఓ బాలీవుడ్ ఇంటర్వ్యూలో రష్మిక తన డెబ్యూ మూవీ గురించి చేసిన కామెంట్స్ ఈ వివాదానికి తెరతీసింది.

ఈ కామెంట్స్ నేపథ్యంలో ఆమెని బ్యాన్ చేయాలంటూ కోలీవుడ్ లో వార్తలు వినిపించాయి. దీనిపై లోలోపల పెద్ద చర్చే సాగింది. " మాతృ భాషని వదులుకొని వేరే భాషలలో నటిస్తున్న నటికి ఇంత అహంకారామా..? కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ అందుకోవడంతో విధానం మారిపోయిందా..? గతం మర్చిపోయావా..? " అంటూ నెటిజన్స్ రశ్మికపై మండిపడుతున్నారు.

తాజాగా ఈ వివాదం గురించి " గుర్తుందా శీతాకాలం " డైరెక్టర్ ని ప్రశ్నించగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. ఒకరి నుండి కృతజ్ఞత కోరుకోవడం తప్పే , నేను కూడా సంజూ వెడ్స్ గీత సినిమాలో చాలా మంది నటీనటులకు అవకాశం ఇచ్చాను. వాళ్ళది గుర్తుపెట్టుకున్నారా? లేదా ? అనేది వాళ్ల మీద ఆధారపడి ఉంటుంది. అదంతా వాళ్ల వ్యక్తిగత విషయం. నేనలాంటివి పట్టించుకోను , ఎదుటివారి నుండి మనం ఏదైనా ఎక్సపెక్ట్ చేసినప్పుడే మనం బాధపడతాం ..

రష్మిక విషయానికి వస్తే .. ఈ హీరోయిన్ ని బ్యాన్ చేస్తే కన్నడ ఇండస్ట్రీకే నష్టం. ఇలాంటివాటిని నేను అసలు సపోర్ట్ చేయనని అన్నారు. నిజమే, రశ్మికని బ్యాన్ చేస్తే నష్టపోయేది కన్నడ ఇండస్ట్రీనే. అక్కడ బ్యాన్ చేసినంత మాత్రాన వేరే భాషలలో అవకాశాలు రాకుండా మానవు కదా. ఇప్పుడామె పాన్ ఇండియా హీరోయిన్.

పుష్ప బ్లాక్ బస్టర్ హిట్ తో రష్మిక రేంజ్ మారిపోయింది. బాలీవుడ్ లో సైతం ఆమె హవా మొదలైంది. అక్కడి ప్రేక్షకులని మెప్పించే విధంగా తనని తాను మౌల్డ్ చేసుకుంటుంది. రష్మిక నేమ్ తో కోట్ల రూపాయల బిజినెస్ జరుగుతుంది. ఈ అమ్మడు బ్రాండ్ అంబాసిడర్ గానూ దూసుకుపోతుంది.

 

 

Tags :