రవితేజ కి ఈ టైం లో రిస్క్ అవసరమా..?

రవితేజ కి ఈ టైం లో రిస్క్ అవసరమా..?

మాస్ మహారాజా రవితేజ క్రాక్ సినిమాతో మళ్ళీ గాడిన పడ్డట్టేనని అంతా అనుకున్నారు. అనుకోకుండా ఖిలాడీ, రామారావు ఆన్ డ్యూటీ సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. ఈ సినిమా ప్లాప్స్ తో రవితేజ రాబోయే సినిమా " ధమాకా " ఎలా ఉండబోతుందో అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

రవితేజ నటిస్తున్న మరో రెండు మూడు సినిమాలు షూటింగ్ జరుపుకుంటున్నాయి. రీసెంట్ గా మాస్ మహారాజా వాల్తేరు వీరయ్య సినిమాలో కీలకమైన గెస్ట్ రోల్ లో నటించారన్న విషయం తెలిసిందే. హీరో గా మంచి ఫామ్ లో ఉన్న సమయంలో గెస్ట్ పాత్రలు చేయడం అవసరమా? అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

మరోవైపు రవితేజ నిర్మాతగా మారి ప్రేక్షకుల ముందుకి సినిమాని తీసుకురాబోతున్నారు. ఈ విషయం పై కూడా నెగటివ్ టాక్ నడుస్తుంది. తమిళ స్టార్ విషు విశాల్ నటించిన " మట్టికుస్తి " చిత్రానికి రవితేజ నిర్మాణ బాధ్యతలు తీసుకున్నారు. హీరోగా హిట్స్ లేకుండా ఇబ్బందిపడుతున్న సమయంలో ఇలాంటి రిస్క్ తీస్కొని నిర్మాణం వైపు ఎందుకు అడుగులు వేస్తున్నారంటూ అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

రవితేజ అప్ కమింగ్ రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు సినిమాల పై కూడా ప్రేక్షకులలో ఆసక్తి నెలకొంది. హీరోగా రవితేజ మరికొంత కాలం ఇండస్ట్రీ లో ఉండాలంటే ప్రస్తుతం రిలీజ్ అయ్యే ధమాకా సినిమా హిట్ అవ్వాల్సిందేనని టాక్.

కెరీర్ ని సక్సెఫుల్ గా కంటిన్యూ చేయాలంటే రవితేజ తన సినిమాలపై కాస్త శ్రద్ధ పెట్టాల్సిందేనని అభిమానులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇలాంటి సమయంలో గెస్ట్ రోల్స్ చేసి ,ప్రొడక్షన్ లోకి అడుగు పెట్టి మరింత రిస్క్ తీసుకోవొద్దు అని మాస్ మహారాజా అభిమానులు కోరుకుంటున్నారు.

 

 

Tags :