నరసరావుపేట ఎంపీ సీటు వాళ్లకిస్తే ఓడిస్తాం

నరసరావుపేట ఎంపీ సీటు వాళ్లకిస్తే ఓడిస్తాం

నరసరావుపేట ఎంపీ సీటును కడప వాళ్లకిస్తే ఓడిస్తామని, తమ వర్గం సహకరించదని మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు స్పష్టం చేశారు.  గుంటూరులో తాడికొండ నియోజకవర్గ టీడీపీ నేత తోకల రాజవర్ధన్‌రావు ఆధ్వర్యంలో టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ జన్మదిన వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా రాయపాటి మాట్లాడుతూ  వచ్చే ఎన్నికల్లో నేను పోటీ చేయాలనుకోవడం లేదు. మా కుటుంబం నుంచి (మా అబ్బాయి, అమ్మాయికి) రెండు అసెంబ్లీ సీట్లు కావాలని గతంలోనే చంద్రబాబును అడిగాం. తాడికొండ సీటును తోకల రాజవర్ధన్‌రావుకు ఇవ్వాలి. ఆయన అక్కడ గెలుస్తారు. నరసరావుపేటలో అవసరమైతే నేనే ఎంపీగా పోటీ చేస్తా. నేను పోటీలోకి దిగితే వీళ్లు ఎవరూ పనికి రారు. నా సీటు వేరే ఎవరికో ఇస్తానంటే చూస్తూ ఊరుకోం అని స్పష్టం చేశారు. పవన్‌ కల్యాన్‌తో పొత్తు ఉంటే మంచిదని అభిప్రాయపడ్డారు.  

 

 

Tags :