ఆర్‌బీఐ గవర్నర్ కు అరుదైన గౌరవం

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్‌కు అరుదైన గౌరవం దక్కింది. ప్రముఖ ఇంటర్నేషనల్ రీసెర్చి జర్నల్ సెంట్రల్ బ్యాంకింగ్ ఆయనకు 2023 సంవత్సరానికి గాను గవర్నర్ ఆప్ ది ఇయర్ పురస్కారాన్ని ప్రకటించంది. కష్టకాలంలో ఆర్‌బీఐ గవర్నర్‌గా ఆయన అందించిన సేవలకు ఈ పురస్కారం ప్రకటించినట్టు సెంట్రల్ బ్యాకింగ్ తెలిపింది. నాన్ బ్యాంకింగ్ సంస్థ కుప్పకూలినప్పుడు, కొవిడ్-19 రెండ్ వేవ్‌లు, రష్యా-ఉక్రెయిన్ యుద్దం కారణంగా నెలకొన్న ద్రవ్యోల్బణం ఒత్తిళ్లను అధిగమించే విషయంలో ఆర్‌బీఐ గవర్నర్ గా సమర్థంగా నిర్వహించారని సెంట్రల్ బ్యాంకింగ్ కొనియాడిరది. ఆ పురస్కారం అందుకున్న రెండో రెండో ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్. ఇంతకు మునుపు 2015లో ఆర్‌బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్‌కు ఈ పురస్కారం లభించింది.
Tags :