జో బైడెన్ సరికొత్త రికార్డు... 130 మంది భారతీయులకు

జో బైడెన్ సరికొత్త రికార్డు... 130 మంది భారతీయులకు

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ సరికొత్త రికార్డు సృష్టించారు. ఆయన పాలనా యంత్రాంగంలో ఏకంగా 130 మందికి పైగా భారత సంతతి వ్యక్తులకు కీలక బాధ్యతలు అప్పగించారు. దాదాపు అన్ని ప్రభుత్వ శాఖల్లో వీరికి చోటు కల్పించారు. భారత సంతతి వ్యక్తులకు ఇంత ప్రాధాన్యం ఇవ్వడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. అమెరికా చరిత్రలోనే తొలిసారి భారత సంతతికి చెందిన మహిళ కమలా హ్యారిస్‌కు ఉపాధ్యక్ష పదవి ఇచ్చారు. మాజీ అధ్యక్షుడు ట్రంప్‌ పాలనా యంత్రాంగంలో 80 మంది భారత సంతతి వ్యక్తులు ఉండేవారు. బరాక్‌ ఒబామా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఈ సంఖ్య 60గా ఉంది. బైడెన్‌ మాత్రం గత ప్రభుత్వాలతో పోల్చితే రికార్డు స్థాయిలో 130మందికి పైగా భారత సంతతి వ్యక్తులకు చోటు కల్పించారు. దీంతో శ్వేతసౌధంలో ఏ సమావేశం జరిగినా అందులో భారత సంతతి వ్యక్తులుంటారు. వీరు లేకండా సమావేశాలు చాలా అరుదుగా జరుగుతుంటాయి.

 

Tags :