రివ్యూ : క్రైమ్ మిస్టరీ, సస్పెన్స్ థ్రిల్లర్ 'రెడ్'

రివ్యూ : క్రైమ్ మిస్టరీ, సస్పెన్స్ థ్రిల్లర్ 'రెడ్'

తెలుగుటైమ్స్.నెట్ రేటింగ్ : 2.5/5 
జానర్ : యాక్షన్‌ థ్రిల్లర్‌

నిర్మాణ సంస్థ :  శ్రీ స్రవంతి మూవీస్  
నటీనటులు : రామ్‌ పోతినేని, మాళవికా శర్మ, నివేదా పేతురాజ్, అమృతా అయ్యర్‌, సంపత్‌ రాజ్‌, వెన‍్నల కిషోర్‌ తదితరులు
సంగీతం :  మణిశర్మ
సినిమాటోగ్రఫీ :  సమీర్‌ రెడ్డి
ఎడిటర్‌ :  జునైద్ సిద్దిఖీ

నిర్మాత :  ‘స్రవంతి’రవికిశోర్

దర్శకత్వం : తిరుమల కిశోర్  
విడుదల తేది : 14. 01. 2021

వై వి ఎస్ చౌదరి  దేవదాస్ తో  పరిచయం అయి తొలి సినిమాతోనే మాస్ లవర్ బోయ్ గా పేరు తెచ్చుకున్న, సినిమా బ్యాక్ గ్రౌండ్ వున్నా ఎంతో కష్టపడుతూ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని. కెరీర్‌ ఆరంభంలోనే కొన్ని హిట్లను తన ఖాతాలో వేసుకున్న రామ్‌,  ఆ తర్వాత వరుస పరాజయాలతో ఇబ్బందులు పడ్డాడు. ఇలాంటి పరిస్థితుల్లో డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన ‘ఇస్మార్ట్ శంకర్' మాస్ మూవీతో మరోసారి హిట్ ట్రాక్ ఎక్కాడు. ఇక ఇప్పుడు అదే జోష్‌ను కంటిన్యూ చేయాలని తనకు గతంలో ‘నేను శైలజ', ‘ఉన్నది ఒకటే జిందగీ' వంటి హిట్లు ఇచ్చిన కిశోర్ తిరుమలతో ‘రెడ్'  అనే సినిమా చేశాడు. తమిళ్ మూవీ 'తడమ్‌' రీమేక్‌గా వస్తున్న ఈ మూవీలో రామ్‌ తొలి సారిగా డ్యూయల్‌ రోల్‌ చేశాడు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్లు, పాటలు సినిమాపై పాజిటీవ్‌ బజ్‌ను క్రియేట్‌ చేశాయి. గతేడాది సమ్మర్ స్పెషల్ గా  విడుదల కావాల్సిన చిత్రమిది.  లాక్‌డౌన్ కారణంగా థియేటర్లు మూతబడటంతో ఆగిపోయింది.  ఓ టి టి లో మంచి ఆఫర్ వచ్చిన ఈ మూవీ ఎట్టి పరిస్థితులలో థియేటర్ లలో చూడాలి అని పట్టు పట్టిన రామ్ నిర్ణయం మేరకు   సంక్రాంతి కానుకగా నేడు‘రెడ్‌’ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమాతో రామ్‌ మరో హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడా?  కిశోర్ తిరుమల,రామ్‌ కాంబో హ్యాట్రిక్‌ విజయం సాధించిందా లేదా తెలియాలంటే సమీక్ష ఏమిటో చూద్దాం.  

కథ :

సిద్ధార్థ్ (రామ్), ఆదిత్య (రామ్) ఐడెంటికల్ ట్విన్స్. ఇద్దరూ పోలికల్లోనే కాదు ఇద్దరి డీఎన్‌ఏ కూడా ఒకేలా ఉంటుంది. సోనియా అగర్వాల్, రవి ప్రేమించి పెళ్లి చేసుకుని అభిప్రాయ భేదాలతో విడిపోతారు. వీరిద్దరి సంతానమే సిద్ధార్థ్, ఆదిత్యలు. పేరెంట్స్ విడిపోవడంతో సిద్దార్థ్ తండ్రి వద్ద, ఆదిత్య తల్లి వద్ద పెరుగుతాడు. ఆదిత్య తల్లికి పేకాట వ్యసనం ఉంటుంది. తనతో పాటు కొడుకుని కూడా పేకాట క్లబ్‌కి తీసుకుని వెళ్లి తన అలవాటుని మానుకోలేక ఇబ్బందుల్లో కూరుకుపోతుంది. దీంతో ఆదిత్య కోపం పెంచుకుంటాడు. అదే సందర్భంలో కొడుకు కోసం తన వ్యసనాన్ని వదిలేసినా తల్లిని అర్థం చేసుకోలేకపోతాడు ఆదిత్య. జీవితంలో ఓడిపోయిన సోనీ అగర్వాల్ ఆత్మహత్య చేసుకుని చనిపోవడంతో తన సోదరుడు సిద్ధార్థ్, తండ్రి దగ్గరకు వెళ్లిపోతాడు ఆదిత్య. అయితే సిద్దార్థ్‌ని చూసుకున్నట్టుగా ఆదిత్యను చూసుకోలేకపోతాడు తండ్రి. దీంతో తండ్రి, సోదరుడుపై కోపం పెంచుకుని ఇంటి నుంచి బయటకు వచ్చేస్తాడు. పేకాట, గ్యాంబ్లింగ్, సెక్స్‌కి బానిస అవుతాడు ఆదిత్య.

తన తల్లికోరిక మేరకు ఆదిత్య లా చేస్తే,  సిద్ధార్థ్ సివిల్ ఇంజనీర్ అయ్యి.. కన్‌స్ట్రక్షన్ కంపెనీకి ఎండీ అవుతాడు. తాను పని చేసే ఆఫీస్‌లోనే మహిమా(మాళవికా శర్మ)అనే యువతిని చూసి ఇష్టపడతాడు. తన ప్రేమను ఆమెతో వ్యక్తం చేయడానికి నానా ఇబ్బందులు పడుతాడు. చివరకు ఎలాగోలా తన ప్రేమ విషయాన్ని ఆమెతో చెప్పేస్తాడు. ఆమె కూడా సిద్దార్థ్‌ను ఇష్టపడుతుంది. కొద్ది రోజుల్లో పెళ్లికూడా చేసుకోవాలనుకుంటారు. కట్‌ చేస్తే. ఫ్రెండ్ పెళ్లి కోసం 15 రోజులు వేరే ఊరి వెళ్తుంది మహిమ. ఇంతలో సిద్దార్థ్ పేకాటలో తన మిత్రుడు వేమ (సత్య) ఎనిమిది లక్షల డబ్బుని పోగొడతాడు. దీంతో అతన్ని రౌడీలు బంధిస్తారు. ఆదిత్య డబ్బు కోసం ఎదురుచూస్తున్న తరుణంలో అనుకోని చిక్కుల్లో పడతాడు సిద్ధార్థ్. ఆకాష్ అనే సంపన్న వర్గానికి చెందిన యువకుడు దారణంగా హత్య గావింపబడతాడు. ఈ నేరంపై సిద్ధార్థ్‌ని జైలులో పెడతారు. అదే సందర్భంలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుపడి అదే స్టేషన్‌కి వస్తాడు ఆదిత్య. ఈ కేసు విచారణ చేపట్టడానికి వస్తారు యామిని (నివేథా పేతురాజ్), నాగేంద్ర కుమార్ (సంపత్ రాజ్). అప్పటివరకూ సిద్దార్థ్ ఈ హత్య చేశాడని ఓ ఫొటో ఆధారంగా ప్రాథమిక అంచనాకు వచ్చిన పోలీస్‌లకు ఆదిత్యను చూసి షాక్ అవుతారు. డబ్బు కోసం ఆదిత్యే ఆకాష్‌ని హత్య చేశాడా?? లేక అదే పోలికలతో ఉన్న సిద్దార్థ్ హత్య చేశాడా? ఆకాష్ హత్యకి మహిమ కనిపించకుండా పోవడానికి లింక్ ఏంటి? ఇంతకీ మహిమ ఏమైంది?? గాయత్రి (అమృత అయ్యర్‌)‌కి ఈ కథతో లింక్ ఏంటి? అసలు సిద్ధార్థ్, ఆదిత్యలు ఒకరా?? లేక ఇద్దరా? అసలు హత్య చేసింది ఎవరు? ఎందుకు అనేదే బిగ్ స్క్రీన్ పై చూడాల్సిందే.  

నటి నటుల హావభావాలు :

రెండు విభిన్నమైన షేడ్స్ వున్నా పాత్రల్లో  కనిపించిన రామ్‌.  ప్రతి ఆదిత్యగా,  సిద్దార్థ్‌ గా వేరియేషన్‌ చూపించి ఆకట్టుకున్నాడు. స్టైల్‌, యాక్షన్‌ తో పాటు మెయిన్ గా  మాస్‌ ఆడియన్స్‌ను అలరించటంలో తనకు తిరుగులేదని  మరోసారి ప్రూవ్‌ చేసుకున్నాడు.  సిద్దార్థ్‌ పాత్రలో క్లాస్‌గా కనిపించి మెప్పించిన రామ్‌.. ఆదిత్య పాత్రలో ఊర మాస్‌గా అలరించాడు. తన నటనతో మరోసారి ఎనర్జిటిక్ స్టార్ అని నిరూపించుకున్నాడు.  ఎస్సై యామినిగా నివేదా పేతురాజ్ మంచి ప్రదర్శన ఇచ్చారు. యామిని పాత్రలో మాళవికా శర్మ మెరుపు ల  కనిపించి తెరపై కనిపించేది కొద్ది నిమిషాలే అయినా..తనదైన ముద్రవేశారు. మాళవిక శర్మ‌-రామ్ రొమాన్స్ బాగా పండింది. లిప్ లాక్‌లతో హీటెక్కించారు.ఇక అమాయకపు యువతి పాత్రలో అమృతా అయ్యర్‌ అద్భుతంగా నటించాడు. ఇక ఈ సినిమాలో పవిత్ర ఆంటీ అపవిత్రమైన పాత్రలో కనిపించి సర్ ప్రైజ్ చేసింది. డబ్బున్న అంకుల్స్‌ని ట్రాప్‌లో పెడ్డడం.. మందు, సిగరెట్‌‌లు తాగుతూ రచ్చ చేసింది. కమెడియన్ సత్య తన పంచ్‌లతో నవ్వులు పంచాడు. సంపత్‌ రాజ్‌, వెన‍్నల కిషోర్‌, సత్య తమ పరిధిమేర నటించారు. 

సాంకేతిక వర్గం పనితీరు :

దర్శకుడు కిషోర్ తిరుమల క్రైమ్ మిస్టరీ, సస్పెన్స్ థ్రిల్లర్ కథలకు ప్రాథమిక సూత్రం ఆడియన్స్‌ని కథలో ఇన్వాల్వ్ చేయడం. నెక్స్ట్ ఏం జరుగుతుందన్న క్యూరియాసిటీ ప్రేక్షకుల్లో కలిగించడం. ప్రేక్షకుల ఊహలకు ఆస్కారం ఇవ్వకుండా కథను మలుచుకుని  దర్శకుడు సక్సెస్ అయినట్టే. అయితే ఈ క్రైమ్ మిస్టరీ కథను గాడిలో పెట్టడానికి ఫస్టాఫ్‌లో చాలా టైం తీసుకున్నాడు.   తొలి 45 నిమిషాలు అసలు కథని టచ్ చేయలేదు. అయితే ఎప్పుడైతే మర్డర్ జరిగిందో. అప్పటి నుంచి కథపై ఆసక్తి పెరిగింది. కథలో మలుపులు.. ట్విస్ట్‌లతో ఆసక్తికరంగా మలిచాడు. ఇంటర్వెల్ బ్యాంగ్ సినిమాకి ఓ  హైప్నిచ్చింది.   స్వతహాగా రచయిత కావడంతో ఈ కథకు కావాల్సిన స్టఫ్ తన కలం నుంచి సమకూర్చుకున్నాడు కిషోర్ తిరుమల. డైలాగ్స్ బాగున్నాయి. నచ్చింది తినాలనుకున్నా.. తినకపోతే ఏమౌతుందిలే అనుకునే బతుకులు వాళ్లవి. అంటూ మధ్యతరగతి వాళ్లపై రాసిన డైలాగ్ బాగా కనెక్ట్ అయ్యే విధంగా ఉన్నాయి. ఇలాంటి డైలాగ్‌లు సినిమాలో చాలానే ఉన్నాయి. రామాయణం మగాళ్లు కాకుండా ఆడాళ్లు రాసిఉంటే.. అనుమానం అనేది ఇప్పటికీ లేకుండా ఉండేది లాంటి గమ్మత్తైన డైలాగ్‌లతో ఆకట్టుకున్నాడు కిషోర్ తిరుమల. మణిశర్మ బ్యాగ్రౌండ్ స్కోర్‌తో మరోసారి ఆకట్టుకున్నారు. డించిక్ డించిక్ సాంగ్‌కి మంచి మార్కులు పడగా.. మిగతా సాంగ్స్‌కి థియేటర్స్‌లో పెద్దగా రెస్పాన్స్ రాలేదు. సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ బాగుంది. ప్రతి ఫ్రేమ్ చాలా రిచ్‌గా అనిపిస్తుంది. పీటర్ హెయిన్ స్టంట్స్ బాగున్నాయి. ఎడిటర్ జునైద్ 

సిద్ధఖీ ఫస్టాఫ్‌లో ఓ పది నిమిషాలు తగ్గిస్తే రన్ టైమ్ క్రిస్పీగా అనిపించేది. స్రవంతి రవి కిషోర్, కృష్ణ చైతన్య నిర్మాణ విలువలు స్క్రీన్‌పై కనిపించాయి. 

విశ్లేషణ:

‘ఇస్మార్ట్ శంకర్'లాంటి సూపర్‌ హిట్‌ తర్వాతా రామ్‌ నుంచి వస్తున్న తొలి చిత్రం ఇదే కావడంతో ‘రెడ్‌’పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలను కొంతమేర దర్శకుడు అందుకున్నాడు. తమిళ్ మూవీ తడమ్‌కు ఇది రీమేకే అయినా.. తెలుగు ఆడియన్స్‌కు నచ్చేలా కథలో మార్పులు చేసి మెప్పించాడు. ఫస్టాఫ్‌లోనే ఇద్దరు రామ్‌లను తెరపై పరిచయం చేసిన దర్శకుడు. మర్డర్ మిస్టరీ కథలోకి వెళ్లే కొలదీ థ్రిల్లింగ్ ట్విస్ట్‌లు, సర్ ప్రైజ్‌‌లతో కథ సాఫీగా సాగిపోతుంది. తొలి భాగం కాస్త స్లో నెరేషన్‌తో విసిగించినా.. సెకండాఫ్‌కి వచ్చేసరికి కథ గాడిలోకి వచ్చింది. అయితే మరీ కుర్చీల్లో కథలకుండా సినిమాలో ఇన్వాల్వ్ అయ్యే మ్యాజిక్ జరగలేదు కానీ.. కథనం కన్ఫ్యూజ్ లేకుండా ఉంది. అయితే ఆదిత్య, సిద్దార్థ్‌లలో స్క్రీన్‌పై కనిపించేది ఎవరు అన్న కన్ఫ్యూజన్ కొన్ని సందర్భాల్లో ఎదురౌతూ ఉంటుంది. ఇద్దరి హెయిర్ స్టయిల్, గెడ్డం సేమ్ టు సేమ్ ఉండటంతో గుర్తుపట్టడం కష్టంగా మారింది. కథ కోసం దర్శకుడు ఇలా స్క్రిప్ట్ రాసుకున్నా. ఇద్దరికీ కాస్త వైవిధ్యం ఉంటే బాగుండని అనిపిస్తుంది. ఓవరాల్‌గా ‘రెడ్’ డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ. సస్పెన్స్ థ్రిల్లర్, క్రైమ్ మిస్టరీ చిత్రాలను ఇష్టపడేవారికి తప్పక నచ్చుతుంది. మరీ ఉత్కంఠభరితమైన క్రైమ్ థ్రిల్లర్ కాదు కానీ.. తప్పకుండా ఒక్కసారైతే చూడతగిన చిత్రం ఈ రెడ్.

 

 

Tags :