వీసా అపాయింట్‌మెంట్‌ సమయాన్ని తగ్గించండి... బైడెన్‌కు ప్రెసిడెన్షియల్‌ కమిషన్‌ సిఫార్సు

వీసా అపాయింట్‌మెంట్‌ సమయాన్ని తగ్గించండి... బైడెన్‌కు ప్రెసిడెన్షియల్‌ కమిషన్‌ సిఫార్సు

వీసా అపాయింట్‌మెంట్‌కు వేచి ఉండే సమయాన్ని అధిక సంఖ్యలో బ్యాక్‌లాగ్‌లు ఉన్న భారత్‌ వంటి దేశాలకు గరిష్ఠంగా రెండు వారాల నుంచి నాలుగు వారాలకు తగ్గించేలా విదేశీ వ్యవహారాల శాఖకు మెమో జారీచేసే అంశాన్ని పరిశీలించాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు ప్రెసిడెన్షియల్‌ కమిషనర్‌ ఒకటి సిఫార్సు చేసింది. భారత్‌, పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, నేపాల్‌ సహా పషిఫిక్‌ ద్వీపాలు, కొన్ని ప్రత్యేక ఆసియా దేశాల రాయబార కార్యాలయాల్లో వలసేతర వీసా, సందర్శక వీసా ( బీ1, బీ2), తాత్కాలిక వర్కర్‌ వీసా ( హెచ్‌, ఎల్‌, వో, పీ, క్యూ) అపాయింట్‌మెంట్లకు సంబంధించి అసాధారణ స్థాయిలో సుధీర్ఘ బ్యాక్‌లాగ్‌లు ఉన్నాయి. ఒక్క భారత్‌నే పరిశీలిస్తే ఇది వెయ్యి రోజులను దాటి పోయింది. ఈ పరిస్థితి అమెరికాలో ఉన్న విదేశాల్లో ఉన్న ఆసియన్‌ అమెరికన్‌, పసిఫిక్‌ ఐలాండర్లకు (ఏఏపీఐ) ఇబ్బందిగా మారింది. వారితో పాటు విద్యార్థులు, వ్యాపారవేత్తలు, సందర్శకులూ ఇబ్బంది పడుతున్నారు. ఈ నేలలో సమావేశమైన ఏషియన్‌ అమెరికన్లు, నేటివ్‌ హవాయియన్లు, పసిఫిక్‌ ఐలాండర్ల విషయంలో అధ్యక్షుడి సలహా మండలి, భారత్‌, పాకిస్థాన్‌, నేపాల్‌, బంగ్లాదేశ్‌, ఇతర దేశాలు సహా ప్రపంచ వ్యాప్తంగా అమెరికా రాయబార కార్యాలయాల్లో వీసా అపాయింట్‌మెంట్‌ సమయాలు ఆలస్యం అవడాన్ని తగ్గించాలని శ్వేతసౌధానికి సిఫార్సు చేసింది.

 

 

Tags :