రిలయన్స్ మరో సంచలనం .. అతి తక్కువ ధరకే

రిలయన్స్ మరో సంచలనం .. అతి తక్కువ ధరకే

జియో మరో సంచలనానికి తెరలేపనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రపంచంలోనే అత్యంత చౌకైన స్మార్ట్‌ ఫోన్‌నున తీసుకొస్తున్నట్టు ప్రకటించిన రిలయన్స్‌ మరో కీలక గ్యాడ్జెట్‌ను రూపొందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. జియో బుక్‌ ల్యాప్‌టాప్‌ను తీసుకొచ్చేందుకు జియో నిర్ణయించింది. 44వ ఏజీ ఎం సమావేశంలోనే దీనిపై ప్రకటన వస్తుందని అందరూ భావించారు. కానీ కేవలం జియో ఫోన్‌ నెక్ట్స్‌పైనే మాట్లాడారు. బ్యూరో ఆప్‌ ఇండియన్‌ స్టాండర్స్‌ (బీఐఎస్‌) వెబ్‌సైట్‌లో సర్టిఫికేషన్‌ కోసం జియోబుక్‌ ల్యాప్‌టాప్‌ వచ్చినట్టు తెలుస్తోంది. జియో నుంచి రాబోయే ల్యాప్‌టాప్‌ మూడు వేరియంట్లు బీఐఎస్‌ సర్టిఫికేసన్‌ సైట్‌లో కంపెనీ లిస్ట్‌ చేసింది. కాగా జియో ల్యాప్‌టాప్‌ లాంచ్‌ తేదిని మాత్రం ఇంకా నిర్ణయంచలేదు. స్నాప్‌డ్రాగెన్‌ ప్రాపెసర్‌, 4జీ ఎల్‌పీడీడీఆర్‌ఎక్స్‌ ర్యామ్‌, 64 జీబీ ర్యామ్‌ స్టోరేజీతో రానుంది. సియోబుక్‌ ధర ఇంకా తెలియాల్సి ఉంది. తక్కువ ధరలోనే జియోబుక్‌ ఉంటుందని టెక్‌ నిపుణులు భావిస్తున్నారు.

 

Tags :