రిలయన్స్ చేతికి అమెరికా హోటల్

రిలయన్స్ చేతికి అమెరికా హోటల్

దేశీయ వ్యాపార దిగ్గజం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ మరో కీలకమైన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. అమెరికాలోని మ్యాన్‌హట్టన్‌ ఫైవ్‌స్టార్‌ హోటల్‌ మాండరిన్‌ ఓరియమెంట్‌ న్యూయార్క్‌ను కొనుగోలు చేసినట్టు ప్రకటించింది. న్యూయార్క్‌లో ప్రీమియం లగ్జరీ హోటల్‌ మాండరిన్‌ ఓరియంట్‌లో 73.37 శాతం వాటాలు కొనుగోళ్లకు రిలయన్స్‌ ఇండస్ట్రియల్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ అండ్‌ హోల్డింగ్స్‌ కొనుగోలు చేసింది. ఈ డీల్‌ విలువ 98.15 మిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.735 కోట్లు). ఈ ఏడాది మార్చి ఆఖరు నాటికి డీల్‌ పూర్తి కావచ్చని రిలయన్స్‌  పేర్కొంది.

ఒక వేళ వోటల్‌లో వాటాలు ఉన్న ఇతర యజమానులు కూడా సుముఖంగా ఉంటే మిగతా 26.63శాతం వాటాలను అదే వేల్యుయేషన్‌సలో ఆర్‌ఐఐహెచ్‌ఎల్‌ కొనుగోలు చేస్తుందని రిలయన్స్‌ తెలిపింది. గతేడాది కాలంలో రిలయన్స్‌ కొనుగోలు చేసిన హోటల్స్‌లో ఇది రెండోది. దీంతో ప్రపంచంలోనే అతిపెద్ద కన్స్యూమర్‌ మార్కెట్లలో ఒకటైన భారత్‌లో రిటైల్‌ పోర్ట్‌ ఫోలియోకు మరింత ఊతమిచ్చినట్టుయింది.

 

Tags :