ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి వచ్చిన ‘జిన్నా’ రెంట్ కట్టి చూసే అవసరమా మాకు? : సినిమా ప్రేమికుడు  

ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి వచ్చిన ‘జిన్నా’ రెంట్ కట్టి చూసే అవసరమా మాకు? : సినిమా ప్రేమికుడు  

మంచు విష్ణు  హీరోగా వచ్చిన ‘జిన్నా’  మూవీ ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది. ప్రైమ్ వీడియోలో తెలుగుతో పాటు మలయాళ భాషలో ఈ సినిమాను వీక్షించవచ్చు. ఇప్పటికే చాలా మంది ప్రైమ్ వీడియోలో ఈ సినిమాను చూసి సోషల్ మీడియా ద్వారా తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నారు. అయితే, కొందరికి ‘జిన్నా’ మూవీ రెంట్ కట్టి చూడాలని ప్రైమ్ వీడియోలో చూపిస్తోంది. బహుశా ఇది అమెరికాలో అయ్యుండొచ్చు. ఎందుకంటే ‘జిన్నా’ మూవీ చూడాలంటే 2.99 డాలర్లు చెల్లించాలని యూజర్లు షేర్ చేసిన స్క్రీన్ షాట్‌లో ఉంది. డైనమిక్ హీరో మంచు విష్ణు, పాయల్ రాజ్‌పుత్ జంటగా బాలీవుడ్ హాట్ బాంబ్ సన్నీ లియోనీ కీలక పాత్రలో నటించిన సినిమా ‘జిన్నా’ . కామెడీ సినిమాల దర్శకుడు జి.నాగేశ్వర్ రెడ్డి కథ అందించిన ఈ చిత్రానికి ఈషాన్ సూర్య దర్శకత్వం వహించారు. అవ ఎంటర్‌టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ బ్యానర్లపై మంచు విష్ణు ఈ సినిమాను నిర్మించారు.

తెలుగుతో పాటు తమిళం, మలయాళం, హిందీ భాషల్లో భారీ అంచనాలతో ఈ సినిమాను మంచు విష్ణు విడుదల చేశారు. కానీ, బాక్సాఫీసు వద్ద ఈ సినిమా బోల్తా కొట్టింది. మంచు విష్ణుకి ప్రస్తుతం ఉన్న నెగిటివిటీతో ఈ సినిమాపై విడుదలకు ముందు దుష్ప్రచారం బాగా జరిగింది. సినిమాలో కూడా కంటెంట్ లేకపోవడంతో ఘోరంగా విఫలమైంది. అయితే, ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను మంచు విష్ణు ప్రైమ్ వీడియోకు విక్రయించారు. ఈరోజు నుంచి ప్రైమ్ వీడియోలో ‘జిన్నా’ స్ట్రీమింగ్ అవుతోంది. ప్రైమ్ వీడియో సబ్‌స్ర్కిప్షన్ తీసుకున్నవారు ఈ సినిమాను వీక్షించవచ్చు. చాలా మంది ప్రైమ్ వీడియోలో ఈ సినిమాను చూసి సోషల్ మీడియా ద్వారా స్పందిస్తున్నారు. ఇప్పుడు కూడా మంచు విష్ణుకి ట్రోలింగ్ తప్పడం లేదు. కొంత మంది ఈ సినిమా ప్రైమ్ వీడియోలో విడుదలవడంపై వెటకారంగా స్పందిస్తుంటే.. మరికొందరు ఇదేం సినిమా అంటూ ఎత్తిపొడుస్తున్నారు. ఇంకొందరయితే సన్నీ లియోనీ కోసం ఒకసారి చూశామంటూ ట్వీట్లు చేస్తున్నారు.

ఇదిలా ఉంటే, ‘జిన్నా’ సినిమా చూడటానికి ప్రైమ్ వీడియో రెంట్ అడుగుతోంది అంటూ కొందరు ఆడియన్స్ ట్విట్టర్ ద్వారా స్పందిస్తున్నారు. ఈ సినిమాకు రెంట్ ఏంటి అంటూ ప్రైమ్ వీడియోపై మండిపడుతున్నారు. ప్రైమ్ వీడియోలో రెంట్ అడుగుతున్న పేజ్‌ను స్క్రీన్ షాట్ తీసి పెడుతున్నారు. ఈ స్క్రీన్ షాట్‌లో 2.99 డాలర్ల రెంట్ అడుగుతున్నట్టు స్పష్టమవుతోంది. అంటే మన కరెన్సీ ప్రకారం సుమారు రూ.242. డాలర్లలో రెంట్ అడుగుతోంది అంటే ఇది కచ్చితంగా యూఎస్‌లో తీసిన స్క్రీన్ షాట్. అంటే, యూఎస్ యూజర్లకు ప్రైమ్ వీడియో ‘జిన్నా’ సినిమాను ఉచితంగా అందించడం లేదా అనే విషయం తెలియాల్సి ఉంది.

 

Tags :