బేఏరియాలో ఘనంగా ఎఐఎ రిపబ్లిక్‌ డే దినోత్సవాలు

బేఏరియాలో ఘనంగా ఎఐఎ రిపబ్లిక్‌ డే దినోత్సవాలు

బే ఏరియాలో 72వ గణతంత్ర దినోత్సవ వేడుకలను వైభవంగా నిర్వహించారు. దాదాపు 38కిపైగా భారతీయ సంఘాలు ఈ గణతంత్ర వేడుకల్లో పాల్గొన్నాయి. కోవిడ్‌ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని వర్చువల్‌ పద్ధతిలో జరిగిన ఈ వేడుకలను యూట్యూబ్‌లో లైవ్‌గా ప్రసారం చేశారు. ఇండియన్‌ కాన్సల్‌ జనరల్‌ డాక్టర్‌ టీవి. నాగేంద్ర ప్రసాద్‌ ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడుతూ, బే ఏరియాలోని భారతీయులు చేస్తున్న కార్యమ్రాలు ప్రశంసనీయమైనవని, సామాజికంగా, సాంస్కృతికంగా, ఆర్థికంగా భారత్‌-అమెరికా మధ్య సంబంధాలను పటిష్టం చేయడంలో కృషి చేస్తున్నాయని చెబుతూ, భారత్‌, అమెరికా దేశాలు ప్రజాస్వామ్య పద్ధతిలో పాలనను సాగిస్తూ, రెండు దేశాల మధ్య సంబంధాలను పటిష్టం చేసుకుంటున్నాయని చెప్పారు. కోవిడ్‌ 19 వ్యాక్సిన్‌ను మైత్రీ పూర్వకంగా భారతదేశం పొరుగుదేశాలకు ఉచితంగా సరఫరా చేస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా టీవీ నాగేంద్ర ప్రసాద్‌ తెలిపారు.  ఈ వేడుకలను పురస్కరించుకుని పలువురు ప్రజాప్రతినిధులు తమ శుభాకాంక్షలను అందజేశారు.

సెనెటర్‌ డేవ్‌ కర్టిస్‌, అసెంబ్లీ మెంబర్లు బిల్‌ క్విర్స్‌, యాష్‌ కల్రా, అలెక్స్‌ లీ, అలమేడా కౌంటీ సూపర్‌వైజర్‌ డేవిడ్‌ హ్యూబర్ట్‌, శాంతాక్లారా కౌంటీ సూపర్‌వైజర్‌ ఒట్టోలీ, శాన్‌హోసె మేయర్‌ శామ్‌ లిక్కార్డో, ఓక్లాండ్‌ మేయర్‌ లిబ్బి, ఫ్రీమాంట్‌ మేయర్‌ లిల్లీ మే, సన్నీవేల్‌ మేయర్‌ లారీ క్లీన్‌, ఫ్రీమాంట్‌ కౌన్సిల్‌ మెంబర్‌ రాజ్‌ సల్వాన్‌, శాన్‌రామన్‌ కౌన్సిల్‌ మెంబర్‌ శ్రీధర్‌ వెరోజ్‌, శాంతాక్లారా కౌన్సిల్‌ మెంబర్‌ రాజ్‌ చాహల్‌ తదితరులు తమ శుభాకాంక్షలను అందజేశారు. తెలుగు అసోసియేషన్‌ ప్రతినిధులు కూడా రిపబ్లిక్‌ డే శుభాకాంక్షలను తెలిపారు. తరంగిణి స్కూల్‌ విద్యార్థులు బాలీవుడ్‌ డ్యాన్స్‌ కార్యక్రమాలను, బే ఏరియా నృత్య గురుకుల్‌ విద్యార్థులు ఏరోడ్యాన్స్‌ను ప్రదర్శించారు. బే ఏరియా గాన కళాకారులు శ్రీధర్‌ గణపతి, సచిన్‌ శ్రీవాస్తవ, శుభచాకి దేశభక్తి గీతాలను, బాలీవుడ్‌ హిట్స్‌ పాటలను పాడారు.

అమెరికన్‌ ఆర్గనైజేషన్‌ ఫర్‌ డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ బీహార్‌ (ఎఓడిబి), ఆశాజ్యోతి ఆర్గనైజేషన్‌, అసోసియేషన్‌ ఆఫ్‌ రాజస్థాన్‌ ఇన్‌ అమెరికా (బే ఏరియా), బీహార్‌ ఫౌండేషన్‌ (యుఎస్‌- కాలిఫోర్నియా బ్రాంచ్‌), బే ఏరియా తెలుగు అసోసియేషన్‌ (బాటా), బే ఏరియా తమిళ్‌ మండ్రం (బిఎటిఎం), బే మలయాళీ, బీహార్‌ అసోసియేషన్స్‌, బ్రహ్మకుమారీస్‌, ఫెడరేషన్‌ ఆఫ్‌ మలయాళీ అసోసియేషన్‌ ఆఫ్‌ అమెరికా, గుజరాతీ కల్చరల్‌ అసోసియేషన్‌ (జిసిఎ), గ్లోబల్‌ ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ ది పీపుల్‌ ఆఫ్‌ ది ఇండియన్‌ ఒరిజిన్‌(గోపియో), టండియా లిటరసీ ప్రాజెక్టు (ఐఎల్‌పి), ఇండో అమెరికన్‌ సొసైటీ ఆఫ్‌ బే ఏరియా, ఇండో అమెరికన్‌ కమ్యూనిటీ ఫెడరేషన్‌ (ఐఎసిఎఫ్‌), కన్నడ కూట ఆఫ్‌ నార్తర్న్‌ కాలిఫోర్నియా (కెకెఎన్‌సి), కాశ్మీరీ టాస్క్‌ఫోర్స్‌ (కెటిఎఫ్‌), మంకా, నాయర్‌ సర్వీస్‌ సొసైటీ, ఓఎస్‌ఎ (కాలిఫోర్నియా ఛాప్టర్‌), పాఠశాల (తెలుగు స్కూల్‌), పంజాబీ కల్చరల్‌ అసోసియేషన్‌ (పిసిఎ), రోటరీ ఇంటర్నేషనల్‌, శాన్‌రామన్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (ఎస్‌ఆర్‌సిఎ), శంకర ఐ ఫౌండేషన్‌ (ఎస్‌ఇఎఫ్‌), స్పందన ఆర్గనైజేషన్‌, ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా), తెలంగాణ కల్చరల్‌ అసోసియేషన్‌ (టిసిఎ), తెలంగాణ డెవలప్‌మెంట్‌ ఫోరం (టిడిఎఫ్‌), యునైటెడ్‌ ఫిజీ అసోసియేషన్‌, ఉత్తరప్రదేశ్‌ మండల్‌ (యుపిఎంఎ), వేద టెంపుల్‌, వొక్కళిగ పరిషత్‌ ఆఫ్‌ అమెరికా (విపిఎ), వి.టి.సేవ తదితర సంస్థలు ఇందులో పాల్గొన్నాయి.

Tags :