ఈ ఉపఎన్నిక కాంగ్రెస్ పార్టీకి చాలా కీలకం : రేవంత్

ఈ ఉపఎన్నిక కాంగ్రెస్ పార్టీకి చాలా కీలకం : రేవంత్

కాంగ్రెస్‌ పార్టీకి మునుగోడు ఉపఎన్నిక చాలా కీలకం అని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి అన్నారు. గాంధీ భవన్‌లో అనుబంధ సంఘాల చైర్మన్‌ల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రేవంత్‌ మాట్లాడుతూ మునుగోడు ఉప ఎన్నికలో పార్టీ అనుబంధ సంఘాల పాత్ర చాలా కీలకమని అన్నారు. ఉప ఎన్నికతో పాటు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లోనూ అనుబంధ సంఘాల చైర్మన్‌లు పట్టుదలతో పని చేయాలని కోరారు. మనం పూర్తి స్థాయిలో కష్టపడి బీజేపీ, టీఆర్‌ఎస్‌ పార్టీలను తరమి కొట్టాలన్నారు. పార్టీ నుంచి బయటకు వెళ్లిన వారి సరైన గుణపాఠం చెప్పాలన్నారు. మునుగోడు ఉప ఎన్నికలో ప్రతి ఒక్కరూ క్షేత్రస్థాయిలో పని చేయాలి అని పార్టీ శ్రేణులకు సూచించారు.

 

Tags :