తెలంగాణలో బెంగాల్ తరహా ప్రయోగం : రేవంత్

ఢిల్లీ లిక్కర్ స్కాం వ్యవహారంపై తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ టీఆర్ఎస్, బీజేపీవి కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు. లిక్కర్ స్కాంలో మిగతా వారిని విచారించి కవితను మాత్రం అనుమతి కోరుతున్నారు. ఇక్కడే అసలు విషయం ఏంటో తెలుస్తోంది. నిజంగా కేసీఆర్ అవినీతి చిట్టా బయట పెట్టాలంటే కోకాపేట భూములు, ఇతర కేసులపై విచారణ చేపట్టాలి. గతంలో ఎన్నికల సంఘానికి నేను చేసిన ఫిర్యాదులపై ఇప్పటికే స్పందన లేదు. తెలంగాణలో బెంగాల్ తరహా ప్రయోగం జరుగుతోంది అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.
Tags :