రాజగోపాల్ రెడ్డి, వెంకట్ రెడ్డి.. ఇద్దరూ వేరు : రేవంత్

రాజగోపాల్ రెడ్డి, వెంకట్ రెడ్డి.. ఇద్దరూ వేరు : రేవంత్

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిపై తాను చేసిన వ్యాఖ్యల విషయంలో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి ఎలాంటి సంబంధం లేదని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా రేవంత్‌ మీడియాతో మాట్లాడుతూ వెంకట్‌రెడ్డికి, తనకు మధ్య ఉద్దేశపూర్వకంగానే కొందరు అగాథం సృష్టించాలని చూస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్‌కు ద్రోహం చేసిన రాజగోపాల్‌ రెడ్డి, పార్టీ కోసమే పని చేసే వెంకటరెడ్డి.. ఇద్దరూ వేరు అని అన్నారు. అపోహలతో మా వెంకన్న మనస్తాపం చెందాల్సిన అవసరం లేదంటూ వెంకట్‌రెడ్డిని ఉద్దేశించి పేర్కొన్నారు. రాజగోపాల్‌రెడ్డి తనపై చేసిన ఆరోపణలపై బహిరంగ చర్చకు సిద్ధమని స్పష్టం చేశారు. రాజగోపాల్‌రెడ్డి చేపట్టిన కాంట్రాక్టులు, ఎనిమిదేళ్లలో ఆయన కేసీఆర్‌పై చేసిన పోరాటాల గురించి చండూరు సభలో మాట్లాడతానని తెలిపారు. తెలంగాణలో అధికారం కోసం బీజేపీ అడ్డదారులు తొక్కుతుందని మండిపడ్డారు.

 

Tags :