పార్టీకి నష్టం కలిగించేలా మాట్లాడితే ఉపేక్షించం.. రేవంత్ రెడ్డి వార్నింగ్!

పార్టీకి నష్టం కలిగించేలా మాట్లాడితే ఉపేక్షించం.. రేవంత్ రెడ్డి వార్నింగ్!

కాంగ్రెస్ పార్టీలోని అందరికీ ఆ పార్టీ తెలంగాణ చీఫ్ రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. ఇకపై పార్టీ నియమావళిని ఉల్లంఘిస్తే ఉపేక్షించేది లేదని తేల్చిచెప్పారు. పార్టీకి నష్టం కలిగేలా మాట్లాడిన వారు ఎవరైనా చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు. అలాగే పార్టీ కార్యక్రమాల్లో పనిచేయకుండా, బాధ్యతారాహిత్యంతో ఉన్న వారందరినీ బాధ్యతల నుంచి తప్పిస్తామని స్పష్టం చేశారు. వారి స్థానంలో కొత్త వారికి ఈ బాధ్యతలు అప్పగిస్తామని వెల్లడించారు. కోమటిరెడ్డిపై టీపీసీసీ చర్యలు తీసుకోవడంలేదంటూ మరో నేత కొండా సురేఖ మీడియా ముందే మండిపడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రేవంత్ రెడ్డిని కోమటి రెడ్డి కలిశారు. ఇప్పుడు రేవంత్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో కొండా సురేఖను టార్గెట్ చేస్తూనే రేవంత్ మాట్లాడినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. అదే సమయంలో తెలంగాణలో పార్టీ వ్యవహారాల ఇంచార్జి మాణిక్ రావు ఠాక్రే కూడా ఈ గొడవలపై స్పందించారు. పార్టీలో అందరినీ కలుపుకుని వెళ్లాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డికి ఉంటుందన్న ఆయన.. అంతర్గత కుమ్ములాటలు కొనసాగుతుంటే ఎన్నికలకు ఎప్పుడు వెళ్తామని  అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీని దెబ్బతీసేలా ఎవరూ మాట్లాడకూడదని చెప్పారు.

 

 

Tags :