రాంగోపాల్ వర్మ బర్త్ డే సందర్భంగా డా.రాజశేఖర్

రాంగోపాల్ వర్మ బర్త్ డే సందర్భంగా డా.రాజశేఖర్

నిత్యం వివాదాలతో సావాసం చేసే రామ్‌ గోపాల్‌వర్మ రాత్’, ‘కౌన్’, ‘భూత్’, ‘ఫూంక్’ చిత్రాలతో భారతదేశంలో హర్రర్ చిత్రాలను ప్రేక్షకులకు పరిచయం చేసిన వ్యక్తి రామ్ గోపాల్ వర్మ. మళ్ళీ ఇప్పుడు ‘Rgv దెయ్యం’ అనే కొత్త దెయ్యం కథతో త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. రాజశేఖర్, స్వాతి దీక్షిత్, తనికెళ్ల భరణి, అనితా చౌదరి, జీవ, బెనర్జీ తదితరులు నటిస్తున్న ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈ నెల 16 న తెలుగు, తమిళం, మలయాళం,కన్నడ,హిందీ 5  భాషలలో విడుదలకు సన్నాహాలు చేసుకొంటుంది. కాగా రాంగోపాల్ వర్మ బర్త్ డే సందర్భంగా "Rgv దెయ్యం" ట్రైలర్ ను  రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా

చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ.. రాంగోపాల్ వర్మ బర్త్ డే సందర్భంగా "Rgv దెయ్యం" ట్రైలర్ ను విడుదల చేస్తున్నాము. మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుతున్నాము. ఆయన తీసిన ఈ సినిమా అద్బుతంగా వచ్చింది. ఈ సినిమాను ఈ నెల 16 న విదుడల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాము ? నిన్న విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ కు చాలా అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. RGV మార్క్ ఉంది కాబట్టి.చిత్ర ట్రైలర్ కు కూడా అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. ట్రైలర్ చూస్తుంటే రాజశేఖర్ కూతురి పాత్రలో నటించిన స్వాతి దీక్షిత్ యాక్షన్ సన్నివేశాలు బాగున్నాయి..అలాగే రాజశేఖర్ తన పాత్ర కోసం మేకప్ లేకుండా, రియల్ గెటప్‌లో నటిస్తుండటం విశేషం. చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈ నెల 16 న RGV "దెయ్యం" చిత్రాన్ని 5 భాషలలో తెలుగు, తమిళం, మలయాళం,కన్నడ, హిందీ భాషలలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాము ?. అలాగే ఈ చిత్రం అందరికీ నచ్చడంతో పాటు సినిమాను చూసిన ప్రేక్షకులందరూ తప్పకుండా ఎంజాయ్ చేస్తారని అన్నారు. 

 

Tags :