బ్రిటన్ ప్రధాని రేసులో ఆసక్తికర పరిణామం

బ్రిటన్ ప్రధాని రేసులో ఆసక్తికర పరిణామం

బ్రిటన్‌ ప్రధాని పోటీ రోజురోజుకూ రసవత్తరంగా మారుతున్నది. రిషి సునక్‌, లిజ్‌ ట్రస్‌ ఇద్దరూ నువ్వా నేనా అన్నట్టు తలపడుతున్నారు.  ఓ టీవీలో జరిగిన నాయకత్వ పోటీలో ఆయన ప్రత్యర్థి లిజ్‌ ట్రస్‌పై రిషి సునక్‌ గెలుపొందారు. తదుపరి ప్రధానిగా వారినే ఎందుకు ఎన్నుకోవాలనే చర్చ స్కైన్యూస్‌లో జరిగింది. ద్రవ్యోల్బణం కారణంగానే దేశంలో ఆర్థిక మాంద్యం పరిస్థితులు ఏర్పడుతున్నాయని రిషి సునక్‌ పేర్కొన్నారు. ద్రవ్యోల్బణాన్ని తగ్గించేందుకు తాను చర్యలు తీసుకుంటానని తెలిపారు. అయితే దేశంలో అధిక పన్నుల కారణంగానే దేశంలో ఆర్థిక మాంద్యం పరిస్థితులు తలెత్తుతున్నాయని లిజ్‌ ట్రస్‌  వివరించారు. ఇందుకు రిషి సునక్‌ అభ్యంతరం తెలిపారు. ప్రేక్షకులు, వ్యాఖ్యాత ఇరువురినీ అనేక ప్రశ్నలు అడిగారు. చివరకు  ఎవరిక మద్దతు ఇస్తారని ప్రేక్షకులను ప్రశ్నించగా చాలా మంది రిషి సునక్‌కే మద్దతు పలికారు. కన్జర్వేటివ్‌ పార్టీ లీడర్ల మద్దతు లిజ్‌ ట్రస్‌కే ఉందన్న వార్తల నేపథ్యంలో టీవీ డిబేట్‌లో గెలవడంతో రిషి సునక్‌కు కాస్త ఊరట కలిగినట్టయింది.

 

Tags :