కోవిడ్ వేళలో ఆపన్నహస్తం అందించిన ‘రిజ్వాన్ మొహినుద్దీన్’

కోవిడ్ వేళలో ఆపన్నహస్తం అందించిన ‘రిజ్వాన్ మొహినుద్దీన్’

కోవిడ్‌ ప్రతి మనిషి భవితవ్యాన్ని నఖశిఖ పర్యంతం మార్చేసింది. కొందరు ప్రాణాలు కోల్పోయారు. మరి కొందరు మృత్యువుతో పోరాడారు. మరి కొందరు సంక్షోభంలో ఉన్న వారికి ధైర్యాన్ని, భరోసాను కల్పించారు. మరి కొందరు సంక్షోభంలో ఇరుక్కున్న వారిని తమకు తోచిన విధంగా సహాయపడి, వారిని ఒడ్డుకు చేర్చారు. వారి జీవితాల్లో వెలుగులు నింపారు. ఆ కోవలోని వారే రిజ్వాన్‌ మొహినుద్దీన్‌. వైద్య రంగంలోకి ప్రవేశించి, కోవిడ్‌ సమయంలో అనేక మంది ప్రాణాలకు ఊపిరి ఊదారు. ఆర్థికంగా కానీ, జెండర్‌ సమస్యలతో గానీ వెనక్కి వెళ్లకుండా హోస్టన్‌ సిటీలోని కోవిడ్‌ రోగులందరికీ తగిన ఏర్పాట్లు చేశారు. ‘యూనివర్శిటీ ఆఫ్‌ మిన్నెసోట మెడికల్‌ సెంటర్‌’ద్వారా కోవిడ్‌ రోగులకు అవసరమైన వాటిని సమకూర్చారు. వ్యాక్సిన్లను కూడా అందించారు. అంతేకాకుండా వర్షాల ద్వారా ఆస్పత్రులు నీటిలో మునిగినప్పుడు కూడా అక్కడి రోగులను జాగ్రత్తా మిన్నెసోట మెడికల్‌ సెంటర్‌ కు తరలించారు. రోగులందర్నీ అత్యంత శ్రద్ధతో తరలించారు. ఇలా చాలమంది రోగులను సురక్షితంగా తరలించి, వారి ప్రాణాలను నిలబెట్టారు. ఇందులో డయాలిసిస్‌ రోగులు కూడా ఉన్నారు. వ్యాక్సిన్ల కొరత ఉన్నప్పుడు కూడా రోగులకు వ్యాక్సిన్లను చేరవేయడంలో జాగ్రత్త వహించారు. ఇలా సకాలంలో రోగులకు వ్యాక్సిన్లు చేరడంలో కాంగ్రెస్‌ నేత షీలా జాక్సన్‌ లీ తో పాటు టెక్సాస్‌ ప్రభుత్వ అధికారులు కూడా ఎంతో సహకరించారని మొహినుద్దీన్‌ ప్రకటించారు.

కేవలం టెక్సాస్‌, హోస్టన్‌ ప్రజలకే కాకుండా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి కూడా ఆయన కోవిడ్‌ వ్యాక్సిన్లను అందించడంలో సహాయపడ్డారు. హోస్టన్‌ లోని భారత కాన్సులేట్‌ జనరల్‌ కార్యాలయ సహకారంతో ఏపీ ప్రభుత్వానికి సహాయపడ్డారు. 1000 ఆక్సిజన్‌ కాన్సన్‌ ట్రేటర్స్‌, 1,700 ఆక్సిజన్‌ సిలిండర్లు, 300 ఆక్సీమీటర్లను ఏపీ ప్రభుత్వానికి అందించారు.

ఏ ఒక్కరు కూడా అనారోగ్యంతో ప్రాణాలు కోల్పోకుండా జాగ్రత్త వహించాలన్నదే మొహినుద్దీన్‌ ముఖ్య ఉద్దేశం. వారి కుటుంబీకుల ఉద్దేశం కూడా ఇదే. ఈ ఏకైక లక్ష్యంతోనే ఆరోగ్య రంగంలో వారి కుటుంబం తగు సేవలను అందిస్తోంది. తన తల్లి అనారోగ్యం పాలవడం, దాదాపు 4 సంవత్సరాల పాటు ఆమె అనారోగ్యంతో మంచాన పడిపోయారు. ఈ విషయమే ఆయన్ను ఎంతో కలిచివేసింది. ఓ సక్సెస్‌ ఫుల్‌ వ్యాపారవేత్తగా, సుప్రసిద్ధ వ్యాపారవేత్తగా అప్పటికే పేరుగడిరచిన ఈయన, తన తల్లి సమస్యను చూసి, ఇలా ఎవరికీ కాకూడదన్న ఉద్దేశంతో ఆరోగ్య రంగంలో తమ సేవలను అందిస్తున్నారు. అనేక మంది ప్రాణాలకు ఊపిరిపోస్తున్నారు. 

 

Tags :