ప్రేక్షకులని మురిపిస్తున్న మూడో సింగం..!

ప్రేక్షకులని మురిపిస్తున్న మూడో సింగం..!

" సింగం " ఈ పేరు వినగానే బాలీవుడ్ ప్రేక్షకుల్లో వైబ్రేషన్స్ స్టార్ట్ అవుతాయి. అంతగా కనెక్ట్ అయ్యారు  అక్కడి వాళ్ళు ఈ సినిమాకి. సింగం ఫ్రాంచైజ్ బాలీవుడ్ లో ఎంత హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. "సింగం , సింగం రిటర్న్స్ " సినిమాలు బాక్సాఫీస్ ని వసూళ్లతో మోతెక్కించాయి.

దాదాపు ఐదు, ఆరువందల కోట్లని ఈ రెండు రెండు భాగాలు సునాయాసంగా రాబట్టాయి. అప్పటినుండి అజయ్ దేవగన్, రోహిత్ శెట్టి కాంబినేషన్ లో సినిమా వస్తుంది అంటే భారీగా అంచనాలు పెరిగాయి. ఈ కాంబో నుండి ఎలాంటి ప్రకటన వచ్చినా బాలీవుడ్ అలెర్ట్ అయ్యే రేంజ్ లో ఫేమస్ అయ్యారు.

ప్రెజెంట్ ఈ ఇద్దరి కాంబినేషన్ లో మరోసారి హిట్ పడబోతుంది." సింగం 3 " ని తెరకెక్కించడానికి రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తుంది. " సింగం అగైన్ " అంటూ మరోసారి రచ్చచేసి బాలీవుడ్ ని షేక్ చేయనున్నారు. ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ సింగం 2 పార్ట్స్ కి మించి ఉండొచ్చు అని సమాచారం.

స్క్రిప్ట్ ఆధ్యంతం ప్రేక్షకులని మెప్పించే విధంగా ఉంటుందని, కథలో కొత్తదనం చూపిస్తూనే యాక్షన్ పీక్స్ లో ఉండేలా డిజైన్ చేస్తున్నారట. ఇక బడ్జెట్ విషయానికి వస్తే మొదటి, రెండు భాగాలకన్నా కూడా భారీగా ఖర్చుచేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే అజయ్ దేవగన్ చేతిలో చాలా సినిమాలు ఉండడం వల్ల ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళడానికి సమయం పడుతుంది.

ముందుగా సైన్ చేసిన సినిమాలు పూర్తి చేశాకే సింగం ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేయాలనుకుంటున్నారట అజయ్ దేవగన్. అలాగే , దర్శకుడు రోహిత్ శెట్టి కూడా వరుస సినిమాలతో బిజీగా ఉండడం కూడా ఈ చిత్ర ఆలస్యానికి ఒక కారణం అనొచ్చు. అన్ని ప్రాజెక్ట్స్ పూర్తయిన తర్వాత ఈ హిట్ కాంబో " సింగం అగైన్ " పై కాన్సన్ట్రేట్ చేసే అవకాశం కనిపిస్తుంది...

 

 

Tags :