టీడీపీ అధినేత చంద్రబాబుపై మండిపడిన వైసీపీ మంత్రి రోజా

టీడీపీ అధినేత చంద్రబాబుపై మండిపడిన వైసీపీ మంత్రి రోజా

టీడీపీ అధినేతల చంద్రబాబుపై వైసీపీ మంత్రి ఆర్కే రోజా మండిపడ్డారు. చంద్రబాబుకు నిజంగా ఎన్టీఆర్‌పై చంద్రబాబుకు ప్రేమ ఉండి ఉంటే సీఎంగా పదవీస్వీకారం చేసిన మొదటి రోజే ‘అన్న క్యాంటీన్’లు పెట్టాల్సిందని విమర్శించారు. అసలు టీడీపీ నాయకులందర్నీ మెంటల్ హాస్పిటల్లో చేర్పించాలని జనం కోరుతున్నారని ఆమె అన్నారు. డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీ రుణాలను ఎగ్గొట్టిన దౌర్భాగ్యుడు అంటూ చంద్రబాబుపై విమర్శల వర్షం కురిపించారు. అక్కచెల్లెళ్లు అందరూ బాగుండాలనే ఆలోచనతోనే జగన్ ప్రభుత్వంలో ఆసరా పథకం పెట్టారని రోజా చెప్పారు. తను అధికారంలో ఉన్నప్పుడు ఏ ఒక్కసారైనా మంచి పథకం పెట్టాలన్న ఆలోచన చంద్రబాబుకు వచ్చిందా? అని ప్రశ్నించారు. ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి టీడీపీకి తూట్లు పొడిచిన వ్యక్తి చంద్రబాబు అని ఆరోపించారు. చంద్రబాబు ప్రభుత్వంలో హోంమంత్రిగా ఉన్న చినరాజప్ప.. హోం కే పరిమితం అయ్యాడని ఎద్దేవా చేశారు. ఇప్పుడు దేశమంతా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వైపు చూస్తున్నారని చెప్పిన ఆమె.. తాము అందిస్తున్న పథకాలు సంక్షేమం కాదా? నిలదీశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు అందరికీ సంక్షేమ ఫలాలు అందించిన నేత సీఎం జగన్ అని ఆమె కొనియాడారు. ఈ రాష్ట్రంలో అసలు ప్రతిపక్షం అవసరం లేదని, పిచ్చి పిచ్చి వేషాలేస్తే తీవ్ర పరిణామాలుంటాయని రోజా హెచ్చరించారు.

 

Tags :