సీఎం కేసీఆర్ ను కలిసిన రోషం బాలు

సీఎం కేసీఆర్ ను కలిసిన రోషం బాలు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‍ను ఢిల్లీలోని అధికార నివాసంలో తెలంగాణ సినీ నటుడు రోషం బాలు కలిశారు. వినాయక చవితి సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‍కు గణపతి ప్రతిమను అందజేశారు. ఈ సందర్భంగా సినీ నటుడు రోషం బాలు మాటాడుతూ ఢిల్లీ గడ్డపై తెలంగాణ రాష్ట్ర ఆత్మగౌరవాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‍ నిలబెట్టారని కొనియాడారు. తెలంగాణ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయడం అభినందనీయమని అన్నారు. మరో మరచిపోలేని జ్ఞపకాన్ని ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్‍కు ధన్యవాదాలు తెలిపారు.

 

Tags :