MKOne TeluguTimes-Youtube-Channel

హాలీవుడ్ లో అవార్డుకు నామినేట్ అయిన RRR

హాలీవుడ్ లో అవార్డుకు నామినేట్ అయిన RRR

కలెనక్షన్ల పరంగా రికార్డు సృష్టిస్తూ... ఓటీటీలో వ్యూస్ పరంగా రికార్డులు బద్దలు కొట్టిన RRR మూవీ మరో ఘనతను సొంతం చేసుకుంది. ప్రతిష్టాత్మక హాలీవుడ్  క్రిటిక్స్ అసోసియేషన్ HCA అవార్డుకు నామినేట్‌ అయింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ , మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , దర్శకధీరుడు రాజమౌళి  కాంబినేషన్‌లో వచ్చిన ఆర్ఆర్ఆర్ మూవీ ఇండస్ట్రీ రికార్డులను బద్దలు కొడుతూ.. బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. మార్చి 24న విడుదలైన ఈ సినిమా ఇటు బిగ్ స్క్రీన్లలోనూ.. అటు ఓటీటీలోనూ సంచలన విజయం నమోదు చేసింది. దాదాపు రూ.1200 పైగా వసూలు చేసి ఇండియా వైడ్‌గా టాప్ సినిమాలలో ఒకటిగా నిలిచింది.

తాజాగా ఈ సినిమాలో మరో ఘనతను సొంతం చేసుకుంది. ప్రతిష్టాత్మక హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ HCA  అవార్డుకు నామినేట్‌ అయింది. బెస్ట్ పిక్చర్ కేటగిరీలో ఆర్ఆర్ఆర్ మూవీకి చోటు దక్కింది. టాప్ గన్ మావ్రీక్ , ది బ్యాట్‌మెన్ , టర్నింగ్ రెడ్ , ఎవరీథింగ్ ఎవరివన్ ఆల్ ఎట్ వన్స్ తదితర సినిమాలతో ఆర్ఆర్ఆర్  పోటీ  పడనుంది.ఆర్ఆర్ఆర్ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ మొదలైనప్పటి నుంచి హాలీవుడ్ కళాకారులు, విమర్శకులు ఈ సినిమా గురించి విపరీతంగా చర్చించుకున్నారు. ఇటీవల విదేశీ ప్రేక్షకులు చూసిన భారతీయ చిత్రాలలో ఒకటిగా నిలిచింది. ముఖ్యంగా అమెరికాలో ఆర్ఆర్ఆర్ మూవీ మంచి విజయాన్ని నమోదు చేసింది. ఈ సినిమా హాలీవుడ్ అవార్డుకు నామినేట్ కావడం పట్ల సినీ ప్రియులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 1920 కాలంలో బ్రిటీష్ బ్యాక్‌డ్రాప్‌లో ఆర్ఆర్ఆర్ఇద్దరు యోధులు కలిసి బ్రిటీష్ పాలకులను ఎదురిస్తే.. ఎలా ఉంటుందనే ఆలోచనతో జక్కన్న ఈ మూవీని రూపొందించారు. బాలీవుడ్ స్టార్స్‌ అజ‌య్ దేవ‌గ‌ణ్‌, అలియా భ‌ట్‌తో పాటు రే స్టీవెన్ స‌న్‌, అలిస‌న్ డూడి, ఒలివియా మోరిస్ వంటి హాలీవుడ్ తార‌లు ఆర్ఆర్ఆర్ మూవీలో యాక్ట్ చేశారు.

HCA TWEET LINKS:

https://twitter.com/HCAcritics/status/1541813386421293056

Tags :