ఆర్ఆర్ఆర్ సినిమాను ఉచితంగా చుడొచ్చు! వెనక్కి తగ్గిన జీ 5

ఆర్ఆర్ఆర్ సినిమాను ఉచితంగా చుడొచ్చు! వెనక్కి తగ్గిన జీ 5

ఓటిటి లో కూడా పే ఫర్ వ్యూ విధానంతో ఆర్ఆర్ఆర్ సినిమాను అందుబాటులోకి తీసుకు రావాలని నిర్ణయించుకుంది జీ 5. కానీ సబ్ స్క్రైబర్స్ నుంచి పెద్ద ఎత్తున నిర‌స‌న వ్య‌క్తం కావ‌టంతో ఇప్పుడు జీ 5 త‌న నిర్ణ‌యాన్ని వెన‌క్కి తీసుకుంది. ఆల్ రెడీ సబ్ స్క్రైబ్ అయిన వాళ్లు ఎలాంటి ఎక్స్‌ట్రా ఛార్జీలు లేకుండా ఆర్ఆర్ఆర్  సినిమాను రేపటినుండి  చూడొచ్చు.  మే 20 నుంచి జీ 5లో ద‌క్షిణాది భాష‌ల్లోకి అందుబాటులోకి రానుంది. ఎంటైర్ సినీ ఇండ‌స్ట్రీ ఆసక్తిగా, ఆతృత‌గా ఎదురు చూసిన పాన్ ఇండియా సినిమాల్లో ఆర్ఆర్ఆర్  ఒక‌టి. ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోలుగా న‌టించిన చిత్ర‌మిది. ఒకే తరానికి చెందిన‌ రెండు వేర్వేరు ఫ్యామిలీల‌కు చెందిన స్టార్ హీరోలు న‌టించిన సినిమా కావ‌టంతో ఇటు మెగా, నంద‌మూరి అభిమానులు ఎంతో ఆస‌క్తిగా సినిమా కోసం ఎదురు చూశారు. మార్చి 25న విడుద‌లైన ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద రికార్డ్ క‌లెక్ష‌న్స్‌ను వ‌సూలు చేస్తూ రూ.1200 కోట్ల మేర‌కు వ‌సూళ్ల‌ను రాబ‌ట్టుకుంది.

ఈ సినిమా బ‌డ్జెట్ దృష్ట్యా మేక‌ర్స్ ప్ర‌భుత్వాల‌తో మాట్లాడి టికెట్ రేట్స్‌ను పెంచుకున్నారు. ఈ పెరిగిన టికెట్ రేట్స్ అనేవి కొంత మంది ప్రేక్ష‌కుల‌కు ఇబ్బందిగా మారడంతో వారు సినిమా థియేట‌ర్స్‌కు వెళ్ల‌లేక పోయారు. అలాంటి ప్రేక్ష‌కులంద‌రూ ఆర్ఆర్ఆర్  సినిమా ఓటీటీ రిలీజ్ కోసం ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూశారు. తాజాగా ఈ సినిమాను మే 20 అంటే శుక్ర‌వారం ప్ర‌ముఖ డిజిట‌ల్ సంస్థ జీ 5లో విడుద‌ల చేస్తున్న‌ట్లు అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డింది. అయితే ఈ సినిమాకు పెట్టిన డిజిట‌ల్ రైట్స్ రేట్ ఎక్కువ‌గా ఉండ‌ట‌మో ఏమో కానీ.. స‌ద‌రు డిజిట‌ల్ సంస్థ కూడా పే ఫర్ వ్యూ లెక్కలో ఆర్ఆర్ఆర్  సినిమాను అందుబాటులోకి తీసుకు రావాలని నిర్ణయించుకుంది. కానీ సబ్ స్క్రైబర్స్ నుంచి పెద్ద ఎత్తున నిర‌స‌న వ్య‌క్తం కావ‌టంతో ఇప్పుడు జీ 5 త‌న నిర్ణ‌యాన్ని వెన‌క్కి తీసుకుంది.

ఆల్ రెడీ సబ్ స్క్రైబ్ అయిన వాళ్లు ఎలాంటి ఎక్స్‌ట్రా ఛార్జీలు లేకుండా ఆర్ఆర్ఆర్  సినిమాను చూడొచ్చు. అయితే కొత్త‌గా స‌బ్ స్క్రైబ్ అయిన వాళ్లు మాత్రం రూ.100 ఎక్స్‌ట్రాగా చెల్లిస్తేనే సినిమాను వీక్షించ‌వ‌చ్చున‌ని తెలియ‌జేశారు. ఆర్ఆర్ఆర్  ఇప్పుడు మే 20 నుంచి జీ 5లో ద‌క్షిణాది భాష‌ల్లోకి అందుబాటులోకి రానుంది. ఆర్ఆర్ఆర్  సినిమా అనేది 1920 బ్యాక్‌డ్రాప్‌లో జరిగే ఫిక్ష‌న‌ల్ పీరియాడిక్ మూవీ. ఇందులో తెలంగాణ యోధుడు గొండు బెబ్బులి కొమురం భీమ్‌గా తార‌క్‌.. మ‌న్యం వీరుడు అల్లూరి సీతారామ‌రాజు పాత్ర‌లో రామ్ చ‌ర‌ణ్ న‌టించారు. చ‌రిత్ర‌లో ఎన్న‌డూ క‌లుసుకోని వారు.. ఒక‌వేళ ఏదేని సంద‌ర్భంలో క‌లుసుకుని బ్రిటీష్ వారిని ఎదిరించిన‌ట్ల‌యితే ఎలా ఉంటుంద‌నే కాన్సెప్ట్‌తో సినిమాను తెర‌కెక్కించారు రాజ‌మౌళి. ఈ చిత్రంలో అజ‌య్ దేవ‌గ‌ణ్‌, ఆలియా భ‌ట్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. ఇంకా హాలీవుడ్ స్టార్స్ ఒలివియా మోరిస్‌, రే స్టీవెన్ స‌న్‌, అలిస‌న్ డూడి కూడా ముఖ్య పాత్ర‌ల్లో న‌టించారు.

https://twitter.com/ZEE5Telugu/status/1527173114924175360?cxt=HHwWgMComer2zbEqAAAA

 

 

Tags :