ఆర్ ఆర్ ఆర్ ఇప్పట్లో రిలీజ్ కాదంటా!

ఆర్ ఆర్ ఆర్ ఇప్పట్లో రిలీజ్ కాదంటా!

విడుదల తేదీ చెప్పడం కూడా కష్టమే..అని  ప్రకటించిన చిత్రయూనిట్
ఆర్ ఆర్ ఆర్ రిలీజ్ డేట్ తో వెనక్కి తగ్గిన సినిమాల సంగతి ఏంటో మరి?

దర్శకధీరుడు  రాజమౌళి, రామ్ చరణ్, ఎన్టీఆర్ త్రయం క్రియేట్ చేసిన అద్భుతాన్ని చూడాలని ఎన్నో కోట్ల మంది ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. అసలే రాజమౌళి మెల్లిగా సినిమాలను తెరకెక్కిస్తాడనే పేరు ఉంది. వాటికి తగ్గట్టుగా ఈ మూవీ షూటింగ్ సమయంలోనే హీరోలకు పలు మార్లు గాయాలు అయ్యాయి. రాజమౌళి, రామ్ చరణ్, ఎన్టీఆర్ త్రయం క్రియేట్ చేసిన అద్భుతాన్ని చూడాలని ఎన్నో కోట్ల మంది ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. అసలే రాజమౌళి మెల్లిగా సినిమాలను తెరకెక్కిస్తాడనే పేరు ఉంది. వాటికి తగ్గట్టుగా ఈ మూవీ షూటింగ్ సమయంలోనే హీరోలకు పలు మార్లు గాయాలు అయ్యాయి. షూటింగ్‌లు వాయిదా పడ్డాయి. అన్నింటి కంటే ఎక్కువగా కరోనా దెబ్బ కొట్టింది. ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ దెబ్బతో ఆర్ఆర్ఆర్ మూవీ షూటింగ్ వాయిదా పడింది. దాంతో సినిమా విడుదల తేదీ కూడా మారుతూ వచ్చింది. అయితే చివరగా అక్టోబర్ 13 కంఫర్మ్ అంటూ తేదీని ప్రకటించారు.

ప్రస్తుతం పరిస్థితులు ఎలా ఉన్నాయో అందరికీ తెలిసిందే. ఉత్తరాదిన థియేటర్ల సమస్యలు, ఏపీలో టిక్కెట్ల రేట్లు ఇలా ఎన్నో సమస్యల మధ్య ఆర్ఆర్ఆర్‌ను విడుదల చేయడం మంచిది కాదనే ఉద్దేశ్యంతోనే వాయిదా వేసినట్టు కనిపిస్తోంది. గత నెలలోనే ఉక్రెయిన్ షెడ్యూల్‌ను పూర్తి చేసేశారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా మొదలుపెట్టినట్టు ప్రకటించారు. ప్యాచ్ అప్ వర్క్‌లో భాగంగా మళ్లీ కొన్ని సీన్లను తెరకెక్కించినట్టు సమాచారం. తాజాగా ఆర్ఆర్ఆర్ విడుదల తేదీపై చిత్రయూనిట్ ప్రకటించింది. అక్టోబర్‌లో విడుదల చేసేందుకు సినిమాను ఆల్మోస్ట్ రెడీ చేశాం.. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా అయిపోవచ్చింది.. కానీ ఈ విషయాన్ని అందరికీ చెప్పాలని అనుకుంటున్నాం. విడుదల వాయిదా వేస్తున్నామని చెప్పగలం కానీ మళ్లీ కొత్త తేదీని మాత్రం ప్రకటించలేకపోతోన్నాం. అన్ని సమస్యలు తొలిగి, మళ్లీ సాధారణ పరిస్థితులు ఏర్పడినప్పుడే ఆర్ఆర్ఆర్‌ను విడుదలచేస్తామని తెలిపింది. 

 

Tags :