ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ అమెరికా పర్యటన

ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ అమెరికా పర్యటన

బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌ కుమార్‌ ఈ నెల 15 నుంచి అమెరికాలో నెల రోజుల పాటు పర్యటించనునాన్నారు. అమెరికాకు వెళ్తూ మార్గమధ్యలో దుబాయిలో ఒక రోజు ముందు గల్ఫ్‌ ప్రవాసీయుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొంటారు. విదేశీగడ్డపై తొలిసారిగా తెలంగాణ దళితుల కోసం దుబాయిల్‌లో అలయ్‌ బలయ్‌ ఆత్మీయ సమ్మేళనాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించడానికి ప్రవాసీయులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. తెలంగాణలో విద్యాధికులైన దళిత బహుజనులను ఆకర్షిస్తున్న ప్రవీణ్‌ కుమార్‌పై విదేశాలలో ఉంటున్న ఈ వర్గపు ప్రవాసీయులకు ప్రత్యేక అభిమానం ఉంది. అయితే దుబాయిలోని అల్‌ ఖోజ్‌లో డలస్కో మీటింగ్‌ హలులో 14న మధ్యాహ్నం ఒంటి గంటకు ఈ సమ్మేళనాన్ని నిర్వహించనున్నట్లుగా నిర్వాహకులు చాకాలి వెంకట్‌, మహతి రమేశ్‌లు తెలిపారు.

 

Tags :