ఆ దేశాల నుంచి వచ్చే వారికి తప్పనిసరి : కేంద్రం

ప్రపంచవ్యాప్తంగా మరోమారు కరోనా వైరస్ ఉద్తృతి చూపుతోన్న తరుణంలో కేంద్రం కీలక చర్యలు చేపడుతోంది. కరోనా ప్రభావిత దేశాల నుంచి వచ్చేవారికి ఆర్టీపీసీఆర్ పరీక్షలు తప్పనిసరి చేసింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ వెల్లడించారు. చైనా, జపాన్, దక్షిణకొరియా, హాంకాంగ్ థాయ్‌లాండ్ నుంచి వచ్చేవారికి తప్పకుండా కొవిడ్ పరీక్షలు నిర్వహించాలి. వారిలో ఎవరికైనా లక్షణాలు కనిపించినా, పాజిటివ్ వచ్చినా క్వారంటైన్‌లో ఉంచాలి. అలాగే ఈ దేశాల నుంచి వచ్చే వారికి ఆరోగ్యస్థితి తెలియజేసేందుకు ఎయిర్ సువిధ ఫారం నిపండం తప్పనిసరి అని మంత్రి వెల్లడించారు.
Tags :