ఐక్యరాజ్యసమితి మొదటి మహిళా శాశ్వత ప్రతినిధిగా.. రుచిరా కంబోజ్

ఐక్యరాజ్యసమితి శాశ్వత ప్రతినిధి సీనియర్ భారత రాయబారి ఇండియన్ ఫారిన్ సర్వీస్ (ఐఎఫ్ఎస్) అధికారిణి రుచిరా కంబోజ్ బాధ్యతలు స్వీకరించారు. భారతదేశం పక్షాన యునైటెడ్ నేషన్స్‌లో మొట్టమొదటి మహిళా శాశ్వత ప్రతినిధిగా రుచిరా బాధ్యతలు స్వీకరించారని యూఎన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుట్రెస్ తెలిపారు. రుచిరా గతంలో భుటాన్ దేశంలో భారత రాయబారిగా పని చేశారు. రుచిరా మొదట ప్యారిస్ లో రాయబారిగా ఉద్యోగ జీవితం ప్రారంభించారు. అనంతరం రుచిరా ఢిల్లీ కి వచ్చి యూరప్ వెస్ట్ డివిజన్ విదేశీ వ్యవహారాల శాఖ అండర్ సెక్రటరీగా పని చేశారు. 1996 నుంచి 1999 వరకు మారిషస్ ఫస్ట్ సెక్రటరీగా సేవలందించారు. దక్షిణాఫ్రికాలో హైకమిషనరుగా పని చేశారు. ఐక్యరాజ్యసమితిలో ప్రతినిధిగా టీఎస్ తిరుమూర్తి స్థానంలో రుచిరా బాధ్యతలు చేపట్టారు.
Tags :