పశ్చిమ దేశాలకు రష్యా హెచ్చరిక

పశ్చిమ దేశాలకు రష్యా హెచ్చరిక

ఉక్రెయిన్‌కు శక్తివంతమైన ఆయుధాలిచ్చి తమను తాను నాశనం చేసుకోవద్దని పశ్చిమ దేశాలకు రష్యా పార్లమెంట్‌ స్పీకర్‌ వ్యాచెస్లావ్‌ వొలోదిన్‌ హెచ్చరించారు. ఉక్రెయిన్‌కు యుద్ధ ట్యాంకులు మినహా గగన తల రక్షణ వ్యవస్థలు తదితరాలను అందజేస్తామంటూ నాటో, అమెరికా ఇస్తున్న హామీలపై ఆయన స్పందించారు. ఎదురుదాడులకు ఉపయోగపడే ఆయుధాలను ఉక్రెయిన్‌కు అందజేస్తే, తాము మరింత శక్తివంతమైన ఆయుధాలను వాడాల్సి వస్తుందని, అంతిమంగా ప్రపంచ వినాశనానికే దారి తీస్తుందన్నారు. 

 

 

Tags :