పాక్ అభ్యర్థనను తిరస్కరించిన రష్యా

పాక్ అభ్యర్థనను  తిరస్కరించిన రష్యా

రష్యాలో అపారమైన చమురు నిల్వలు ఉన్నాయి. ఆ దేశ  ప్రధాన ఆదాయ వనరుల్లో చమురు ఒకటి. అయతే ఉక్రెయిన్‌పై యుద్ధం నేపథ్యంలో రష్యా నుంచి  చమురు, గ్యాస్‌ కొనుగోలు చేయకుండా ఈయూ దేశాలతో పాటు, పలు పాశ్చాత్య దేశాలు ఆంక్షలు విధించాయి. ఈ నేపథ్యంలో తన చిరకాల మిత్ర దేశం భారత్‌కు డిస్కౌంట్‌పై చమురు అందించడానికి రష్యా ముందుకు వచ్చింది. అప్పటి నుంచి భారత్‌ తక్కువ ధరకే  చమురును దిగుమతి చేసుకుంటోంది. దీనితో పాకిస్థాన్‌, కూడా రష్యా నుంచి తక్కువ ధరకు చమురును పొందేందుకు ప్రయత్నించింది. పాక్‌ పెట్రోలియం శాఖ మంత్రి ముసాదిక్‌ మాలిక్‌ నేతృత్వంలోని అధికారుల బృందం రష్యాకు వెళ్లింది. భారత్‌ మాదిరే తమకు కూడా 30 నుంచి 40  శాతం డిస్కౌంట్‌తో చమురును సరఫరా ఏయాలని వారు కోరారు.  నవంబరు 29న మాస్కోలో రష్యా అధికారులతో వారు చర్చలు జరిపారు. అయితే పాక్‌ అభ్యర్థనను రష్యా తిరస్కరించింది.

 

 

Tags :