దాని ఫలితమే ఈ దూకుడు... పోప్ ఫ్రాన్సిన్

దాని  ఫలితమే ఈ దూకుడు... పోప్ ఫ్రాన్సిన్

ఉక్రెయిన్‌, రష్యా ఉద్రిక్తతలపై పోప్‌ ఫ్రాన్సిస్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా మద్దతు ఉన్న నాటో కూటమిపై తీవ్ర విమర్శలు చేశారు. రష్యా గుమ్మం ముందు నాటో మొరగడమే రష్యా దూకుడుకు కారణమని వ్యాఖ్యానించారు. ఉక్రెయిన్‌ విషయంలో రష్యా తీరుపై పోప్‌ను ప్రశ్నించగా రష్యా సమీప దేశాల్లో నాటో ఉనికి పుతిన్‌ను రెచ్చగొట్టి ఉంటుంది. దాని ఫలితమే ఈ దూకుడు అని అనుకుంటున్నా అని సమాధానమిచ్చారు. రష్యా అధ్యక్షులు పుతిన్‌ను తప్పకుండా కలుస్తానని పోప్‌ తెలిపారు. ఉక్రెయిన్‌పై యుద్ధం ఆపే విషయమై తాను రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో చర్చించాలనుకుంటున్నట్లు తెలిపారు. ఇప్పటికే ఈ అంశంపై క్రెమ్లిన్‌ను సమయం కోరగా, అటువైపు నుంచి ఎటువంటి సమాధానం రాలేదన్నారు. తనతో భేటీ అయ్యే ఉద్దేశం పుతిన్‌కు లేదోమోనని అభిప్రాయపడ్డారు.

 

Tags :