తమకు సహకరిస్తే.. వారిని విడుదల చేస్తాం

తూర్పు ఉక్రెయిన్ భూభాగాలపై రష్యా సైనికులు పెద్దఎత్తున దాడులకు పాల్పడ్డారు. మేరియుపొల్ హస్తగతానికి, ఇతర నగరాల్లో ఇంకా చొచ్చుకుపోయేందుకు మరింతగా ప్రయత్నించారు. అజోవ్‌స్తల్ ఉక్కు కర్మాగార ఆవరణలోని బంకర్లలో క్షతగాత్రులుగా ఉన్న తమ సైనికులను సురిక్షతంగా బయటకు తీసుకురావడానికి సహకరిస్తే దానికి బదులుగా తమవద్ద యుద్ధ ఖైదీలుగా ఉన్న రష్యా సైనికులను విడుదల చేస్తామని ఉక్రెయిన్ ప్రతిపాదించింది. దీనిపై చర్చలు కొనసాగుతున్నాయి. ఈ ప్రాంగణం మినహా మేరియుపొల్‌లోని మిగతా ప్రాంతాలు రష్యా నియంత్రణలోకి వెళ్లడంతో ఆహారం, తాగునీరు, మందులు అందక ప్రజలు అల్లాడిపోతున్నారు. దాడులకు భయపడి తామ నగరాలను వీడుతున్నారని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఖర్కివ్, చెర్ని హైవ్, సుమీ తదితర ప్రాంతాల్లో దాడులు ముమ్మరంగా కొనసాగాయి.
Tags :