ఒడెసాపై రష్యా దాడులు

ఒడెసాపై రష్యా దాడులు

ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర కొనసాగిస్తున్నది. ఒడెసా పట్టణానికి సమీపంలోని పలు ప్రాంతాల్లో పౌరుల ఇండ్లపై క్షిపణి దాడులతో రష్యా విరుచుకుపడింది. ఈ దాడుల్లో 19 మంది సామాన్య పౌరులు చనిపోయారని అధికారులు వెల్లడించారు. 38 మంది పౌరులకు తీవ్ర గాయాల య్యాయని తెలిపారు. ఉగ్రవాద దేశం మా ప్రజలను పొట్టన పెట్టుకుంటున్నది. ఉక్రెయిన్‌ సైనికులతో పోరాడలేక సామాన్య పౌరులపై విరుచుకుపడుతున్నది అని రష్యాపై ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ మండిపడ్డారు.

 

Tags :