వెనక్కి తగ్గిన రష్యా.. మళ్లీ ఆ నగరంపై

వెనక్కి తగ్గిన రష్యా.. మళ్లీ ఆ నగరంపై

ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌ను ఆక్రమించుకునేందుకు యుద్ధం తొలినాళ్లలో ప్రయత్నించిన తర్వాత వెనక్కి తగ్గిన రష్యా, తాజాగా మళ్లీ ఆ నగరంపై దాడులకు దిగింది. ఆదివారం తెల్లవారుజామున కీవ్‌పైకి పుతిన్‌ సైన్యం 14 క్షిపణులను ప్రయోగించింది.  ఈ దాడుల్లో కనీసం రెండు నివాస భవనాలు నేలమట్టమయ్యాయి.  నలుగురు గాయపడ్డారు. శిథిలాల కింద చిక్కుఉన్న ఏడేళ్ల ఓ బాలికను స్థానికులు రక్షించారు. ఈ నెల 5 తర్వాత కీవ్‌పై రష్యా వైమానిక దాడులకు పాల్పడటం ఇదే తొలిసారి.

 

Tags :