ఇదొక చరిత్రాత్మక దినం.. కొత్త శకాన్ని ప్రారంభించబోతున్నాం

ఇదొక చరిత్రాత్మక దినం.. కొత్త శకాన్ని  ప్రారంభించబోతున్నాం

ఉత్తర అట్లాంటిక్‌ సైనిక కూటమి (నాటో)లో చేరాలని నిర్ణయించుకున్నట్లు రష్యా సరిహద్దు దేశమైన ఫిన్లాండ్‌ అధికారికంగా ప్రకటించింది. ఇదొక చరిత్రాత్మక దినం. కొత్త శకాన్ని ప్రారంభించబోతున్నాం అని  ఆ దేశాధ్యక్షుడు సౌలీనీనిస్తో, ప్రధాని సనా మారిన్‌ హెల్సీంకీలోని అధ్యక్ష భవనంలో సంయుక్తంగా పేర్కొన్నారు. ఫిన్లాండ్‌ పార్లమెంటు కొద్దిరోజుల్లో ఈ  నిర్ణయూన్ని ఆమోదించనుంది. సభ్యత్వం కోసం లాంఛనంగా దరఖాస్తును నాటోకు సమర్పించనున్నారు. ఉక్రెయిన్‌ తదుపరి మద్దతు అందించడంతో పాటు ఫిన్లాండ్‌, స్వీడన్‌లను నాటోలో చేర్చుకునే విషయమై చర్చించడానికి 30 సభ్య దేశాలకు చెందిన దౌత్య వేత్తలు బెర్లిన్‌లో సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో ఫిన్లాండ్‌ ప్రకటన వెలువడిరది. కొత్త దేశాలకు సభ్యత్వం ఇచ్చే విషయం సత్వరం కొలిక్కి తెస్తామని నాటో సెక్రటరీ జనరల్‌ జెన్స్‌ స్టోల్తెన్‌బెర్గ్‌ ప్రకటించారు.

 

Tags :